ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fake Insurance : ఏడు కార్లకు రూ.46 వేలు బీమా చెల్లింపు.. చివరికి ఆ పాలసీలు నకిలీ అని తేలింది..

ABN, First Publish Date - 2023-07-02T11:48:05+05:30

మోసగాళ్ల కన్ను పడని రంగం కనిపించడం లేదు. వాహనాలకు బీమా చేయడంలో కూడా నకిలీలు వేధిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినపుడు అసలు విషయం వెలుగులోకి వస్తోంది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించవలసి వస్తోంది. ఇటువంటి సంఘటన తాజాగా నవీ ముంబైలో జరిగింది. వాహనాలకు నకిలీ బీమా పాలసీలను విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థానే : మోసగాళ్ల కన్ను పడని రంగం కనిపించడం లేదు. వాహనాలకు బీమా చేయడంలో కూడా నకిలీలు వేధిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినపుడు అసలు విషయం వెలుగులోకి వస్తోంది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించవలసి వస్తోంది. ఇటువంటి సంఘటన తాజాగా నవీ ముంబైలో జరిగింది. వాహనాలకు నకిలీ బీమా పాలసీలను విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నవీ ముంబై సబ్‌ ఇన్‌స్పెక్టర్ అరుణ్ బిలారే తెలిపిన వివరాల ప్రకారం, కలంబొలి ప్రాంతంలో ఆటోమొబైల్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి 2018 జూన్‌లో ఏడు వాహనాలకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించారు. నిందితునికి రూ.46,370 చెల్లించారు. వీటిలో ఓ వాహనం ప్రమాదానికి గురికావడంతో, ప్రమాద బీమా కోసం క్లెయిమ్ చేశారు. తనిఖీలో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడు మిగిలిన పాలసీల గురించి కూడా ఆరా తీశారు. అవి కూడా నకిలీవేనని వెల్లడైంది.

బాధితుని ఫిర్యాదు ఆధారంగా నిందితునిపై ఐపీసీ సెక్షన్లు 420 (మోసగించడం, ఆస్తిని విడుదల చేసేవిధంగా నిజాయితీ లేకుండా ప్రేరేపించడం), 406 (నేరపూరిత నమ్మకద్రోహానికి పాల్పడటం), 465 (ఫోర్జరీ), 468 (మోసగించడం కోసం ఫోర్జరీ చేయడం) ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడు ఘన్‌సోలి ప్రాంతంలో ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

ఇవి కూడా చదవండి :

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

Pakistan : భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ కొత్త వ్యూహాలు

Updated Date - 2023-07-02T11:48:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising