ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi excise policy case : మనీశ్ సిసోడియా సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2023-05-24T17:16:53+05:30

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిలు కోసం ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Manish Sisodia, AAP
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిలు కోసం ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో తాను దాఖలు చేసిన మధ్యంతర బెయిలు దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు. ఓ కేసులో రెగ్యులర్ బెయిలు దరఖాస్తుపై తీర్పు రిజర్వు కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీ మద్యం విధానం (Delhi excise policy), 2021-22 ప్రస్తుతం రద్దయింది. ఈ విధానం రూపకల్పన, అమలులో అక్రమాలు, అవినీతి జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ-CBI), ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ED) కేసులు నమోదు చేశాయి. దాదాపు 15 మందిని అరెస్టు చేశాయి. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ ప్రశ్నించింది. మనీశ్ సిసోడియా ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసుకునేందుకు ఆరు వారాలపాటు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఆయన తరపు న్యాయవాది మోహిత్ మాథుర్ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ, సిసోడియా సతీమణి ఆరోగ్యం మెరుగైందని, రెగ్యులర్ బెయిలు దరఖాస్తుపై తీర్పు రిజర్వులో ఉందని తెలిపారు. మధ్యంతర బెయిలు దరఖాస్తులను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని కోరారు. జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ అందుకు అనుమతించారు. అయితే ఈ దరఖాస్తులను ఉపసంహరించుకోవడంపై సీబీఐ తరపు న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిసోడియా తరపు న్యాయవాదులు వాస్తవాలను దాచిపెడుతున్నారని బయటపెడుతుండటం వల్లే ఈ మధ్యంతర బెయిలు దరఖాస్తులను ఉపసంహరించుకుంటున్నారని ఆరోపించారు. సిసోడియా సతీమణి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మధ్యంతర బెయిలు కోసం దరఖాస్తు చేశారని, తన సతీమణి ఆరోగ్య పరిస్థితిని సాకుగా చూపించి, మధ్యంతర బెయిలు కోరారని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఎక్సయిజ్ పాలసీ కుంభకోణంలో సిసోడియా కీలక సూత్రధారి అని, ఆయనే దీని రూపశిల్పి అని సీబీఐ ఆరోపిస్తోంది. ఆయన అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి అని, సాక్షులను ప్రభావితం చేయగలరని చెప్తోంది.

సిసోడియా తరపు న్యాయవాది బుధవారం కోర్టులో వాదనలు వినిపిస్తూ, ప్రాసిక్యూషన్ భ్రమలు, ఊహలను బట్టి కేసు ఉండదన్నారు. ఈ వాదనలు శుక్రవారం కూడా కొనసాగుతాయి. ఆ రోజు ఈడీ వాదనలు వినిపించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

New Parliament Building : ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు

Updated Date - 2023-05-24T17:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising