Delhi Liquor Scam: సిసోడియా అరెస్టుపై ఆప్ నిరసనల వెల్లువ
ABN, First Publish Date - 2023-02-27T09:52:49+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు దేశవ్యాప్తంగా...
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది.(AAPs nationwide protest) ఢిల్లీతోపాటు పలు నగరాల్లో ఆప్ కార్యకర్తలు సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.మద్యం అమ్మకాలకు సంబంధించి(Delhi Liquor Scam) రద్దు చేసిన పాలసీలో అవినీతికి సంబంధించి సీబీఐ 8 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత సిసోడియాను అరెస్టు చేసింది.(Sisodias arrest) ఆప్ నిరసనల దృష్ట్యా దేశ రాజధాని నగరంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి : Covid-19: కోవిడ్ ఏ ల్యాబ్ నుంచి లీక్ అయిందంటే...యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సంచలన నివేదిక
మనీష్ సిసోడియాను సోమవారం అవెన్యూ కోర్టులో హాజరుపర్చి సీబీఐ మంత్రిని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.దర్యాప్తులో సహకరించకపోవడం, కీలకమైన అంశాలపై వివరణ ఇవ్వకుండా తప్పించుకోవడం వల్లే అరెస్టు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.గత ఏడాది జూన్‌లో అప్పటి ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు చేశారు. ఆ తర్వాత మళ్లీ సిసోడియాను అరెస్టు చేయడం సంచలనం రేపింది. నిరసన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఢిల్లీ నలుమూలల నుంచి ఆప్ మద్దతుదారులు, నేతలు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు.సిసోడియా అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసనలతో ఆప్ సోమవారం బ్లాక్ డే జరుపుకుంటుందని ఆప్ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
ఇది కూడా చదవండి : Delhi: ఢిల్లీలో దారుణం...వీధికుక్కపై ఆగంతకుడు ఏం చేశాడంటే...
దేశంలోని లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన గొప్ప విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఫేక్ కేసులో అరెస్టయ్యారని, దీనికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ ట్వీట్‌లో పేర్కొన్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిసోడియా నివాసానికి వెళ్లి అతని భార్యను కలుసుకుని ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.‘‘మనీష్ భార్య తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. భార్య ఇంట్లో ఒంటరిగా ఉంది. మనీష్ ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాడు’’అని కేజ్రీవాల్ చెప్పారు.సిసోడియా అరెస్టు ఢిల్లీలోని లక్షలాది మంది పిల్లల చదువును అవమానించడమేనని సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు.
Updated Date - 2023-02-27T09:54:00+05:30 IST