Aircraft Emergency landing: గగుర్పాటు కలిగించిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో వైరల్
ABN, First Publish Date - 2023-07-12T14:38:51+05:30
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెట్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ప్రైవేటు విమానంలో బుధవారంనాడు సాంకేతిక లోపం తలెత్తడంలో క్షణాల్లో వెనక్కి మళ్లింది. రన్‌వే మీద ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి, నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ముందుకు దొర్లింది. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఇద్దరు పైలట్లకు ఎలాంటి హాని జరగలేదు.
బెంగళూరు: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెట్ (HAL) విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ప్రైవేటు విమానంలో బుధవారంనాడు సాంకేతిక లోపం తలెత్తడంలో క్షణాల్లో వెనక్కి మళ్లింది. రన్‌వే మీద ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పడం, రన్‌వైపే నిలిచిన నీటిలోనే ముందుకు వెళ్లి నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ముందుకు దొర్లింది. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులోని ఇద్దరు పైలట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒళ్లు గగుర్పొడిచే విధంగా కనిపించే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రీమియర్ 1ఏ విమానం 'హాల్' నుంచి కెంపెగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం బయలుదేరింది. కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. విమానం ముందు వైపునున్న నోస్ ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ అవడంతో ఆ సమాచారం హాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేసిన పైలట్ తక్షణం విమానాన్ని వెనక్కి మళ్లించారు. రన్‌వేను తాకిన విమానం అక్కడ నీరు ఉండటంతో నీటిలోంచే ముందుకు దూసుకు వెళ్లింది. నోస్ ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా విమానం పక్కకు ఒరుగుతూ ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మినహా ప్రయాణికులు ఎవరూ లేరని, పైలట్లకు ఎలాంటి గాయాలు కాలేదని డీజీసీఏ ఓట్వీట్‌లో తెలిపింది.
Updated Date - 2023-07-12T14:39:19+05:30 IST