ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uniform Civil Code : అఖిలేశ్ యాదవ్‌కు షాక్.. యూసీసీకి మద్దతిచ్చిన ఆయన మిత్ర పక్షం..

ABN, First Publish Date - 2023-07-02T11:00:54+05:30

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)కు గట్టి షాక్ తగిలింది. ఆయన మిత్ర పక్షం సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)కు మద్దతు ప్రకటించింది. దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని స్పష్టం చేసింది.

Akhilesh Yadav, Om Prakash Rajbhar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)కు గట్టి షాక్ తగిలింది. ఆయన మిత్ర పక్షం సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)కు మద్దతు ప్రకటించింది. దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని స్పష్టం చేసింది.

ఎస్‌బీఎస్‌పీ చీఫ్, ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ రాజ్‌భర్ (Om Prakash Rajbhar) మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని, అందుకు తాను మద్దతిస్తానని చెప్పారు. అందరికీ ఒకే చట్టం ఉండాలని చెప్పారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నదానికి తాను మద్దతిస్తానని చెప్పారు.

ఇదిలావుండగా, యూసీసీకి సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ప్రకటించలేదు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్ శుక్రవారం మాట్లాడుతూ, యూసీసీపై బీజేపీ ప్రచారం జరుపుతోందని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టడం కోసం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. యూసీసీని కాంగ్రెస్, డీఎంకే, జేడీయూ, నేషనల్ కాన్ఫరెన్స్, వ్యతిరేకిస్తున్నాయి. శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీలు దీనికి మద్దతిస్తున్నాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షం ఎన్‌పీపీ దీనిని వ్యతిరేకిస్తోంది. మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధ్యక్షుడు కాన్రాడ్ కె.సంగ్మా (Conrad K.Sangma) మాట్లాడుతూ, భారతదేశ వాస్తవ ఆలోచనకు యూసీసీ విరుద్ధమని చెప్పారు.

మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తారని, సంబంధితులంతా తమ అభిప్రాయాలను ఈ సంఘానికి తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తారని కొందరు చెప్తున్నారు.

వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాల్లో దేశ ప్రజలందరికీ ఒకే చట్టం వర్తించాలని యూసీసీ మద్దతుదారులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు, రాజ్యాంగం కూడా ఇదే అంశాన్ని చెప్తున్నాయి. లా కమిషన్ ఆఫ్ ఇండియా దీనిపై సంప్రదింపుల ప్రక్రియను జూన్ 14న ప్రారంభించింది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి నెల రోజుల గడువు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

Pakistan : భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ కొత్త వ్యూహాలు

Updated Date - 2023-07-02T11:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising