ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amit shah: 2జి,3జి, 4జీ‌లను విసిరేయండి...

ABN, First Publish Date - 2023-06-11T21:17:01+05:30

కాంగ్రెస్, డీఎంకే పార్టీలను కేంద్రం హోం మంత్రి 2జి,3జి,4జిలతో పోల్చారు. ఈ మూడు-జీలను విసిరికొట్టి, ఇదే గడ్డపై పుట్టిన వ్యక్తికి పట్టం కట్టే సమయం ఇప్పుడు వచ్చిందని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లూరు: కాంగ్రెస్, డీఎంకే పార్టీలను కేంద్రం హోం మంత్రి 2జి,3జి,4జి (2G,3G,4G)లతో పోల్చారు. ఈ మూడు-జీలను విసిరికొట్టి, ఇదే గడ్డపై పుట్టిన వ్యక్తి (Son of the Siol)కి పట్టం కట్టే సమయం ఇప్పుడు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్, డిఎంకే పార్టీలు ఆనువంశిక, అవినీతి పార్టీలని ఆరోపించారు. వెల్లూరులో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, 370వ అధికరణ రద్దును ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయని, మోదీ ఒక్క కలం పోటుతో కశ్మీర్‌ను భారత్‌తో అనుసంధానించారని అన్నారు.

"కాంగ్రెస్, డీఎంకేలు 2జి,3జి,4జి పార్టీలు. నేను మాట్లాడుతున్నది 2జి స్పెక్ట్రం కేటాయింపు కుంభకోణం గురించి కాదు. 2జి అంటే రెండు జనరేషన్లు, 3జి అంటే మూడు జనరేషన్లు, 4జి అంటే నాలుగు జనరేషన్లు'' అని అమిత్‌షా వివరించారు. డీఎంకేకు చెందిన మారన్ ఫ్యామిలీ రెండు జనరేషన్లుగా అవినీతి చేస్తున్నారని, కరుణానిధి కుటుంబం మూడు జనరేషన్లుగా అవినీతికి పాల్పడుతుండగా, గాంధీ కుటుంబం 4జీ అని అన్నారు. రాహుల్ గాంధీది నాలుగో జనరేషన్ అని, నాలుగు జనరేషన్లుగా వారు అధికారిని అనుభవిస్తున్నారని అమిత్‌షా విమర్శించారు. తమిళనాడులో ఈ 2జీ,3జీ,4జీలను గద్దె దింపి ఇక్కడే పుట్టినవారికి అధికారం ఇచ్చే సమయం వచ్చిందని అన్నారు.

తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వం పదేళ్లుగా ఉందని, రూ.12,000 కోట్ల అవినీతి, కుంభకోణాలకు ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని, ప్రపంచదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మోదీ ఇనుమడింపజేశారని, భారతదేశానికి భద్రతను పాదుకొలిపారని అమిత్‌షా వివరించారు. ఇటీవలే పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించారని, చోళుల నాటి రాజదండాన్ని సాంప్రదాయబద్ధంగా పార్లమెంటు భవనంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా ఆమిత్‌షా ఆదివారంనాడు తమిళనాడు వచ్చారు.

Updated Date - 2023-06-11T21:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising