ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amit Shah: పార్లమెంట్‌ ఎన్నికల్లో పొత్తుపై అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2023-03-31T08:24:25+05:30

వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ తమిళనాట అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ తమిళనాట అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ప్రకటించారు. ఢిల్లీలో ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకుందని, ఆ పొత్తుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. తమిళనాట బీజేపీ, అన్నాడీఎంకే మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆ పార్టీతో పొత్తు పదిలంగా ఉందని, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఈ పొత్తు కొనసాగుతుందని ఆయన వివరించారు.

అవును పొత్తు పదిలమే: ఎడప్పాడి పళనిస్వామి

బీజేపీతో పొత్తు పదిలమేనని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) పేర్కొన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రిగా సభానిబంధన 110వ కింద చేసిన ప్రకటనల ప్రకారం పథకాలన్నింటినీ పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా తరలిస్తున్నా డీఎంకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.

Updated Date - 2023-03-31T08:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising