ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bomb Threat : అమితాబ్, ధర్మేంద్రలకు బాంబు బెదిరింపులు

ABN, First Publish Date - 2023-03-01T13:03:03+05:30

ముంబైలోని జుహు, విలే-పార్లే, గమ్‌దేవి పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు వెంటనే అమితాబ్, ధర్మేంద్రల నివాసాల వద్ద తనిఖీలు చేశారు.

Amitabh Bachan, Dharmendra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై : బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (Dharmendra)ల నివాసాల సమీపంలో బాంబులు పెట్టినట్లు ఓ ఆగంతకుడు నాగ్‌పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ మంగళవారం వచ్చినట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ముంబై పోలీసులకు ఈ సమాచారాన్ని అందజేశారు.

ముంబైలోని జుహు, విలే-పార్లే, గమ్‌దేవి పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు వెంటనే అమితాబ్, ధర్మేంద్రల నివాసాల వద్ద తనిఖీలు చేశారు. అయితే అనుమానించదగిన వస్తువులేవీ కనిపించలేదు. ఈ ఆగంతకుడు మరో బెదిరింపు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద దాడి చేయడం కోసం 25 మంది సాయుధులు ముంబైలోని దాదర్‌కు చేరుకున్నారని చెప్పినట్లు సమాచారం.

అమితాబ్‌కు ముంబైలో ఐదు విలాసవంతమైన బంగళాలు ఉన్నాయి. ధర్మేంద్రకు జుహూలో ఓ బంగళా ఉంది.

ఇవి కూడా చదవండి :

Lok Sabha Elections : బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్న కమల్ హాసన్!

Rahul Gandhi : రాహుల్ గాంధీ న్యూ లుక్స్... చూసి తీరాల్సిందే...

Updated Date - 2023-03-01T13:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!