ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

China Occupation : ఇలా ఎవరూ మాట్లాడకూడదు.. రాహుల్ గాంధీపై మండిపడ్డ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సంజయ్..

ABN, First Publish Date - 2023-08-20T15:58:09+05:30

భారత దేశం తన భూభాగాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భద్రతా రంగ నిపుణుడు, భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా సేవలందించి, పదవీ విరమణ చేసిన సంజయ్ కుల్కర్ణి ఘాటుగా స్పందించారు.

Rahul Gandhi , Lt Gen (Rtd) Sanjay Kulkarni

న్యూఢిల్లీ : భారత దేశం తన భూభాగాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భద్రతా రంగ నిపుణుడు, భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా సేవలందించి, పదవీ విరమణ చేసిన సంజయ్ కుల్కర్ణి ఘాటుగా స్పందించారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను జరుపుకోవడం కోసం ఆయన కుమారుడు రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

సంజయ్ కుల్కర్ణి ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదన్నారు. 1950 నుంచి దాదాపు 40,000 చదరపు కిలోమీటర్ల భూమిని భారత దేశం కోల్పోయిందని, దానిని చైనా ఆక్రమించుకుందని చెప్పారు. ఇకపై మరింత భూమిని కోల్పోకుండా చూసుకోవడానికే ప్రయత్నం జరుగుతోందన్నారు. అయితే మనం భూమిని కోల్పోయామని చెప్పడం కేవలం మన అవగాహనకు సంబంధించినది మాత్రమేనని, ఇటువంటి ప్రకటనలు ఒకరిని మరొకరికి వ్యతిరేకంగా పేలవంగా చూపుతాయని చెప్పారు.


ప్రధానంగా రెండు ఘర్షణ ప్రాంతాలు - దెమ్‌చోక్, డెప్సాంగ్ - ఉన్నాయని, ఇక్కడ గస్తీని నియంత్రిస్తున్నారని, భారత్-చైనా మధ్య సైనిక చర్చలు జరుగుతున్నాయని కుల్కర్ణి చెప్పారు. మనం భూమిని కోల్పోయామని చెప్పడం సరైనది కాదన్నారు. చర్చలు జరుగుతున్నపుడు ఇటువంటి ప్రకటనలను ఎవరూ ఇవ్వకూడదన్నారు.

రాహుల్ తన తండ్రి రాజీవ్ 79వ జయంత్యుత్సవాల సందర్భంగా పాంగాంగ్ సో సరస్సు వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత దేశానికి చెందిన ఒక అంగుళం భూమినైనా చైనా ఆక్రమించుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నారని, అది నిజం కాదని మండిపడ్డారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని స్థానికులు కూడా చెప్తున్నారన్నారు. పశువులను మేపుకునే స్థలాలను చైనా సైన్యం ఆక్రమించుకుందని చెప్తున్నారని తెలిపారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని తెలిపారు. మన భూమిని చైనా లాక్కోవడం కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమేనని తెలిపారు.

రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మాట్లాడుతూ, ‘‘హిందీ చీనీ భాయి భాయి’’ అని నినాదాలు చేసిన కాంగ్రెస్ ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. 45 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు కాంగ్రెస్ అప్పగించిందన్నారు.

ఇదిలావుండగా, భారత్, చైనా కార్ప్స్ కమాండర్స్ లెవెల్ 19వ విడత చర్చలు ఈ నెల 13, 14 తేదీల్లో జరిగాయి. లడఖ్ సెక్టర్లో ఉద్రిక్తతలను సడలించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి సమస్యలపై మేజర్ జనరల్ లెవెల్ చర్చలు శుక్రవారం జరిగాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి.


ఇవి కూడా చదవండి :

Tungabhadra: నిలకడగా తుంగభద్ర

Congress : సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ.. గాంధీలతో పాటు సచిన్, థరూర్‌లకు చోటు..

Updated Date - 2023-08-20T16:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising