ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Case : సీబీఐ విచారణకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2023-04-16T11:06:42+05:30

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal) ఆదివారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ

Arvind Kejriwal, Atishi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal) ఆదివారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ -CBI) కార్యాలయంలో హాజరయ్యేందుకు బయల్దేరారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొన్ని దేశ వ్యతిరేక శక్తులు భారత దేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. అయినప్పటికీ దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ఆ శక్తులకు తాను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.

ఢిల్లీ మద్యం విధానం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను సాక్షిగా ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా అరెస్టయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవితను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే సుమారు 11 మంది అరెస్టయి తిహార్ జైలులో ఉన్నారు.

కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ఆప్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మంత్రులు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, తదితర నేతలు ఉన్నారు. అనంతరం వీరంతా కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి, ప్రార్థనలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కోసం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో కేజ్రీవాల్ హాజరవుతారు.

ఇవి కూడా చదవండి :

MS Dhoni: వీరాభిమానిని కలిసిన ధోనీ.. మురిసిపోయిన ఖుష్బూ.. ఆమె ట్వీట్ వైరల్!

Congress candidate: బళ్లారి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తేలిపోయింది...

Updated Date - 2023-04-16T11:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising