Chandra Babu Arrest : రేప్ కేసు మినహాయించి మిగిలిన సెక్షన్లు అన్నీ చంద్రబాబుపై బనాయించటం ఘోరం : అశోక్ గజపతి రాజు
ABN, First Publish Date - 2023-09-09T10:21:19+05:30
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్రంగా ఖండించారు.
విజయ నగరం : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్రంగా ఖండించారు. ఈ అక్రమ అరెస్టుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు స్పష్టమవుతోందని చెప్పారు. అత్యాచారం కేసు మినహాయించి, మిగిలిన అన్ని సెక్షన్ల ప్రకారం ఆరోపణలను చంద్రబాబుపై నమోదు చేయడం అత్యంత ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను ఎందుకు అరెస్టు చేస్తున్నదీ పోలీసులు చెప్పడం లేదన్నారు.
ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసే తీరు ఇదా జగన్ రెడ్డీ ? అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ ప్రజలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఓ సైకో, దొంగ నాలుగున్నరేళ్ల నుంచి కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకోగలిగిందన్నారు.
ఇదిలావుండగా, చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏ-37గా పేర్కొన్నారు. అయితే చంద్రబాబు స్పందిస్తూ, ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. కనీసం ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
Chandra Babu Arrest : చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి
Updated Date - 2023-09-09T10:21:24+05:30 IST