ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajastan: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు: అశోక్ గహ్లోత్

ABN, First Publish Date - 2023-11-20T15:27:12+05:30

బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాల్లో ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉందని.. తద్వారా పెట్రోల్, డీజిల్ పై ఆయా రాష్ట్రాలు ప్రజలను విపరీతంగా బాదేస్తున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot) ఆరోపించారు.

జైపుర్: బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాల్లో ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉందని.. తద్వారా పెట్రోల్, డీజిల్ పై ఆయా రాష్ట్రాలు ప్రజలను విపరీతంగా బాదేస్తున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot) ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జైపుర్లో(Jaipur) మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ని, రాజస్థాన్ ని పోల్చి చూపుతూ ప్రధానికి పలు ప్రశ్నలు సంధించారు.


"కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ విధానంపై దాడి చేసి, దేశ ప్రజలకు అన్యాయం చేస్తోంది. రాష్ట్రాలకు పంపిణీ చేసే ప్రాథమిక ఎక్సైజ్ సుంకాన్ని తొలగించి.. దాని స్థానంలో, కేంద్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకాలను ప్రవేశపెట్టింది. వీటిలో అదనపు ఎక్సైజ్ సుంకాలు 1, 2 సెస్సులు ఉన్నాయి. వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బును తమ ఖాతాలోకి మళ్లిస్తుండటంతో రాష్ట్రాలు తమ వాటా హక్కును పొందలేకపోతున్నాయి. తద్వారా రాష్ట్రాలకు, దేశ ప్రజలకు అన్యాయం జరుగుతోంది. రాజస్థాన్ తో పోల్చితే మధ్యప్రదేశ్ లో ఎక్సైజ్ సుంకం ఎక్కువ. తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలూ ఎక్కువే. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి. బీజేపీ పదేళ్లుగా దేశానికి ఏం చేసిందో చెప్పాలి. ప్రధాని మోదీ పాలనలో దేశం అధోగతి పాలైంది" అని గహ్లోత్ విమర్శించారు.

రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా, మిజోరాం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్థాన్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు సాధించింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.

Updated Date - 2023-11-20T15:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising