ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Assembly polls: పోలింగ్‌కు సిద్ధమైన మిజోరం, ఛత్తీస్‌గఢ్ ఫేజ్-1

ABN, First Publish Date - 2023-11-06T20:56:09+05:30

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఛత్తీస్‌గఢ్ లో తొలి విడత పోలింగ్‌, మిజోరంలో ఒకే విడతలో పోలింగ్‌ పూర్తిచేయడానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతగా 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది.

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Five states Assembly polls) భాగంగా మంగళవారంనాడు ఛత్తీస్‌గఢ్ (Chhattishgarh)లో తొలి విడత పోలింగ్‌, మిజోరం(Mizoram)లో ఒకే విడతలో పోలింగ్‌ పూర్తిచేయడానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతగా 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది.


ఛత్తీస్‌గఢ్‌ తొలివిడతలో...

ఛత్తీస్‌గఢ్‌‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో మంగళవారం పోలింగ్ జరుగనుండగా, ఈ 20 స్థానాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లో ఉండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 40 వేల మంది సీఆర్‌పీఎఫ్, 20 వేల మంది రాష్ట్ర పోలీసులతో కలిపి మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బంది రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘా ఏర్పాట్లు చేశారు. మొత్తం 5,340 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, సమస్యాత్మక ప్రాంతాలకు పోలింగ్ సిబ్బందిని, ఈవీఎంలను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. తొలి విడతలో 223 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా, సమస్యాత్మక స్థానాల్లో పోలింగ్ 7 నుంచి 3 గంటల వరకు, ఇతర స్థానాల్లో ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.


మిజోరంలో..

మిజోరంలోని మొత్తం 40 స్థానాల్లోనూ మంగళవారం ఒకే విడతలో పోలింగ్ జరిపేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. 174 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 8.57 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం 4 గంటల వరకూ జరుగుతుందని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈఓ) మధుప్ వ్యాస్ తెలిపారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 149 పోలింగ్ స్టేషన్లు రిమోట్ పోలింగ్ స్టేషన్లు కాగా, 30 పోలింగ్ కేంద్రాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులు వెంబడి ఉన్నాయి. దేశంలోనే అత్యంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటాయనే పేరు కూడా మిజోరం రాష్ట్రానికి ఉంది. ఈసారి కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,00 మంది పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో సీఏపీఎఫ్‌ను మోహరించారు. అధికారం మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), ప్రధాన విపక్ష పార్టీ జోరం పీపుల్స్ మూమెంట్ (జేపీఎం), కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లోనూ తమతమ అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ 23 స్థానాల్లోనూ, తొలిసారిగా ఎన్నికల బరిలోకి అడుగుపెట్టిన ఆప్ 4 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. కాగా, డిసెంబర్ 3న మిజోరం ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-11-06T20:56:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising