Delhi: ఢిల్లీలో దారుణం...వీధికుక్కపై ఆగంతకుడు ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2023-02-27T08:27:10+05:30 IST

ఢిల్లీలో దారుణం జరిగింది. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు...

Delhi: ఢిల్లీలో దారుణం...వీధికుక్కపై ఆగంతకుడు ఏం చేశాడంటే...
stray dog

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు ఓ నాలుగేళ్ల బాలుడిని పొట్టన బెట్టుకున్న ఘటనతో వీధికుక్కల బాగోతం తెరమీదకు వచ్చింది. ఆ ఘటన మరవక ముందే దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో దానికి విరుద్ధంగా ఓ వీధికుక్కపై(street dog) గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది.(Atrocious in Delhi) ఢిల్లీ నగరంలోని హరినగర్ లో గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి : Assembly polls: మేఘాలయ, నాగాలాండ్‌లలో పోలింగ్ ప్రారంభం

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హరినగర్ స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు తర్వాత పోలీసులు ఈ ఘటనపై చర్య తీసుకున్నారు.భారతీయ శిక్షాస్మృతి, జంతు చట్టంలోని సెక్షన్ 377/11 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.వీడియో ఆధారంగా ఢిల్లీ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు విచారణ(probe underway) జరుపుతున్నారు.

Updated Date - 2023-02-27T08:27:12+05:30 IST