ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra : రాహుల్ గాంధీని ఆ కీలక నేత ఇంతలా ప్రశంసించడం అనూహ్యం

ABN, First Publish Date - 2023-01-04T14:15:20+05:30

భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని అయోధ్య

Champat Rai, Ayodhya Ramalayam Trust Secretary
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని అయోధ్య రామాలయం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ (Champat Rai) ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న ‘ఈ యువకుడికి’ ధన్యవాదాలని, ఆయన కృషిని మెచ్చుకుంటున్నానని, అందులో తప్పేమీ లేదని అన్నారు. తమిళనాడులో ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతోంది.

రాహుల్ గాంధీ యాత్ర గురించి విలేకర్లు ప్రశ్నించినపుడు చంపత్ రాయ్ స్పందిస్తూ, రాహుల్ ఎంతో ఇబ్బందికర వాతావరణంలో పాదయాత్ర చేస్తున్నారని, దీనిని తప్పనిసరిగా మెచ్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా యాత్ర చేయాలన్నారు. తాను ఆరెస్సెస్ (Rashtriya Swayam Sevak Sangh) కార్యకర్తనని, భారత్ జోడో యాత్రను ఆరెస్సెస్ ఎప్పుడూ ఖండించలేదని తెలిపారు.

ఇదిలావుండగా, అయోధ్యలోని రామజన్మభూమి దేవాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దేవ్ డిసెంబరు 31న రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, ‘‘శ్రీరాముని ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నారో అది విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆయుష్మాన్‌భవ’’ అని పేర్కొన్నారు. ‘సర్వ జన హితం, సర్వ జన సుఖం’ అనే ఉన్నత లక్ష్యం కోసం మీరు పోరాడుతున్నారని ప్రశంసించారు. ప్రజల కోసం, ప్రజల సంతోషం కోసం మీరు కృషి చేస్తున్నారని తెలిపారు.

Updated Date - 2023-01-04T14:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising