ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Azad on UCC: యూసీసీ అంటే 370 అధికరణను రద్దు చేసినట్టు కాదు..!

ABN, First Publish Date - 2023-07-08T20:00:15+05:30

ఉమ్మడి పౌర స్మృతి అమలు విషయంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రం జాగరూకతతో ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రాటిక్ ప్రొగ్రసిస్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ అజాద్ అన్నారు. యూసీసీని అమలు చేయడమంటే జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికారణను రద్దు చేసినంత సులువు కాదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC) అమలు విషయంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రం జాగరూకతతో ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రాటిక్ ప్రొగ్రసిస్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ అజాద్ (Ghulam Nabi Azad) అన్నారు. యూసీసీని అమలు చేయడమంటే జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికారణను రద్దు చేసినంత సులువు కాదన్నారు. కేవలం ముస్లింలే కాకుండా సిక్కులు, క్రిస్టియన్లు, గిరిజనులు, జైనులు, పార్శీలు వంటి అన్ని మతాలతో ముడిపడిన విషయమని, ఒకేసారి వారంతా ఆగ్రహిస్తే అది ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదని అన్నారు. అసలు ఇలాంటి చర్య (UCC impllmentation) గురించి ఎప్పటికీ ప్రభుత్వం ఆలోచించకోవడమే మంచిదని ఆజాద్ సలహా ఇచ్చారు.


వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తత స్వీకారం సహా పలు అంశాల్లో దేశపౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని యూసీసీ నిర్దేశిస్తుంది. ఉమ్మడి పౌర స్మృతి అమలు అంశం దశాబ్దాలుగా బీజేపీ అజెండాలో ఉంది. ఇటీవల ఈ ఎజెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా యూసీసీపై చర్చ మొదలైంది. ఒకే ఇంట్లో రెండు చట్టాలు ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మోదీ ప్రశ్నించారు. యూసీసీ అమలు అంశాన్ని లేవనెత్తడం ద్వారా ప్రస్తుత ప్రజాసమస్యలను మోదీ పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కొన్ని బీజేపీ భాగస్వామ్య పార్టీల నుంచి కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఇండియా ఆలోచనకు (Idea of India) యూసీసీ వ్యతిరేకమని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె.సంగ్మా ప్రకటించారు. కాగా, ప్రతిపాదిత యూసీసీ నుంచి క్రిస్టియన్లు, కొన్ని ట్రైబల్ ఏరియాలను మినహాయించే విషయాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి నైఫూ రియో సారధ్యంలోని 12 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్టు నాగాలాండ్ ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2023-07-08T20:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising