Balloon Festival: పొల్లాచ్చి ‘బెలూన్ ఫెస్టివల్’ ప్రారంభం
ABN , First Publish Date - 2023-01-14T10:51:49+05:30 IST
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చిలో ‘అంతర్జాతీయ బెలూన్ పండుగ’(International Balloon Festival)

పెరంబూర్(చెన్నై), జనవరి 13: రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చిలో ‘అంతర్జాతీయ బెలూన్ పండుగ’(International Balloon Festival) శుక్రవారం ప్రారంభమైంది. ఈ వేడుకల్లో బ్రెజిల్, అమెరికా, థాయ్‌లాండ్ సహా పలు దేశాల నుంచి డైనోసార్, ఎలుగుబంటి, కార్టూన్ తదితర 10 రకాల డిజైన్‌లతో కూడి భారీ బెలూన్లు ఎగురుతూ ఆకట్టుకున్నాయి. 60 నుంచి 100 అడుగుల ఎత్తులో తమ ఇళ్ల మీదుగా ఎగురుతున్న భారీ బెలూన్లను ప్రజలు ఆశ్చర్యంగా వీక్షించారు. పలువురు ఈ దృశ్యాలో సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. ఈ బెలూన్ ఫెస్టివల్ ఈ నెల 15వ తేది వరకు జరుగనున్నాయి. వేడుకలు జరిగే ప్రాంగణంలో ఎగ్జిబిషన్, రెస్టారెంట్లు ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.