Bangalore: ఆ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం మామూలుగా లేదుగా.. పెద్ద తలకాయలు కూడా..
ABN, First Publish Date - 2023-05-14T12:32:59+05:30
కాంగ్రెస్ గాలికి కమలం కొట్టుకుపోయింది. జిల్లాలో 5 విధానసభ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగులేని
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ గాలికి కమలం కొట్టుకుపోయింది. జిల్లాలో 5 విధానసభ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగులేని అధిపత్యంతో విజయఢంకా మోగించారు. బళ్లారి నగరం కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌రెడ్డి చేతిలో గాలి జనార్ధన్‌రెడ్డి(Gali Janardhan Reddy) కుటుంబం ఓడిపోయింది. కేఆర్‌పీపీ నుంచి గాలి జనార్ధర్‌రెడ్డి భార్య గాలి లక్ష్మి అరుణకు ఓటమి తప్పలేదు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి కూడా ఓడిపోయారు. బళ్లారి గ్రామీణ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి శ్రీరామలు ఓటమి చెందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేంద్ర చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. కంప్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన మంత్రి శ్రీరాములు మేనఅల్లుడు సురేష్ బాబు కాంగ్రెస్ అభ్యర్థి జి.ఎన్ గణేష్ చేతిలో మరోసారి ఓడిపోయారు. సిరుగుప్ప బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సోమలింగప్ప కూడా కాంగ్రెస్ అభ్యర్థి బి.ఎం నాగరాజు చేతిలో చావుదెబ్బ తిన్నారు. సండూరులో కాంగ్రెస్ అభ్యర్థి తుకారం మరోసారి తిరుగులేని అధిపత్యం సాధించి బీజేపీ(BJP) అభ్యర్థి శిల్పా రాజశేఖర్‌పై ఘనవిజయం సాధించారు. సండూరు, బళ్లారి నగరంలో కేఆర్‌పీపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. శనివారం బళ్లారిలోని మహాబలేశ్వరప్ప కళాశాలలో 5 నియోజకవర్గాల ఓట్లు లెక్కిపు చేశారు. ఉదయం 8 గంటలకే ఈవీఎంలు తెలిచి లెక్కింపు ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కించారు.
Updated Date - 2023-05-14T12:32:59+05:30 IST