ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bangalore: ఇక ఆపరేషన్ హస్తం..! టచ్‌లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు

ABN, First Publish Date - 2023-08-17T10:55:45+05:30

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి జంపింగ్‌లు కొత్తేమీ కాదు. తిరుగులేని మెజారిటీతో

- డీకేను రహస్యంగా కలిసిన మునిరత్న

- పార్టీలో చేరేవారిని స్వాగతిస్తాం: డీకే శివకుమార్‌

- కాంగ్రెస్‌లోకి ఎవరైనా రావచ్చు: హోంశాఖ మంత్రి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి జంపింగ్‌లు కొత్తేమీ కాదు. తిరుగులేని మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ‘ఆపరేషన్‌ హస్తం’ అంశం హల్‌చల్‌ చేయడం సర్వత్రా కుతూహలం రేకెత్తిస్తోంది. దక్షిణభారత్‌లో కర్ణాటక(Karnataka) నుంచే ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‏ను బలోపేతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంపూర్ణంగా సహకరిస్తుండడంతో జోడెద్దుల వ్యవహారం ఎంతమందిని అక్కున చేర్చుకుంటుందో అనేది చర్చనీయాంశమవుతోంది. ఆపరేషన్‌ హస్తం అంశానికి బలం చేకూర్చేలాంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి గెలుపొందిన 17 మంది 2019లో రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిన విషయం తెలిసిందే. అంతకు ముందు దశాబ్దాలపాటు కాంగ్రె్‌సలో కొనసాగిన వారు రాజకీయంగా భవిష్యత్తు ఉండదని, బీజేపీలో చేరి మంత్రులయ్యారు. వీరందరికీ హామీలిచ్చిన రాష్ట్ర బీజేపీ కీలక నేత బీఎస్‌ యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు ఇటీవల గుడ్‌బై చెప్పారు. మూడున్నరేళ్లపాటు ప్రభుత్వం సాగించిన బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలో బీజేపీని సమైక్య పరిచి ముందుకు సాగించే సత్తా కల్గిన నేత ఎవరనేది ప్రశ్నగా మారింది. అంతా అధిష్టానం కనుసైగల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో బీజేపీ ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నా వారం పదిరోజుల్లోనే ప్రతిపక్షనేతను ఎన్నుకున్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు ముగిసినా ప్రతిపక్షనేతను ఎంపిక చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిణామాలకు బీజేపీలో కొనసాగితే అండగా నిలిచేవారు లేరని పలువురు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‏కు తిరుగులేదనే సంకేతాలు ఉన్నాయి.

రాజకీయ మనుగడే లక్ష్యంగా..

రాజకీయాల్లో మరింతకాలం రాణించాలనుకుంటే పార్టీ ఫిరాయించడమే ఏకైక మార్గమని భావిస్తున్న కొందరు ముఖ్యనేతలు హస్తం వైపు తొంగి చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా వారిని ఇప్పుడే చేర్చుకోవడం ద్వారా సంబంధిత నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయవచ్చని భావిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యకలాపాల్లో అంటీముట్టనట్టుగా మారిపోయారు. మూడున్నరేళ్లపాటు సహకార శాఖమంత్రిగా, మైసూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా నిత్యం క్రియాశీలకంగా కొనసాగిన యశ్వంతపుర ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్‌ ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. తాజాగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‏లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వీరిలో బెంగళూరుకు చెందినవారు ఇద్దరు కాగా, ఉత్తర కర్ణాటకకు చెందినవారు మరో ముగ్గురు ఉన్నట్టు సమాచారం. రాజరాజేశ్వరినగర్‌ ఎమ్మెల్యే మునిరత్న అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడ్డారనే విషయమై డీసీఎం డీకే శివకుమార్‌, ఆయన సోదరుడు, ఎంపీ డీకే సురేశ్‌ పలు సందర్భాలలో విచారణ జరుపుతామని బహిరంగంగా ప్రకటించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఈలోగానే మునిరత్న, డీకే శివకుమార్‌ను రహస్యంగా భేటీ కావడం విశేషం. ఇదే విషయమై బుధవారం మునిరత్న మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా డీకే శివకుమార్‌(DK Shivakumar) పరిచయమని అందుకే కలిశానని చెప్పుకున్నారు. కానీ తన రాజకీయ గురువు కాంగ్రెస్‌ నేత బీకే హరిప్రసాద్‌(BK Hariprasad) అంటూ వ్యాఖ్యానించారు. డీకే శివకుమార్‌ను కలవడంలో ప్రత్యేక రాజకీయ చర్చలు లేవన్నారు. అవసరమైతే రాజకీయాల నుంచైనా తప్పుకుంటానని కానీ మళ్లీ కాంగ్రె్‌సలోకి వెళ్లేది లేదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం నేరమైతే తన పదవీకాలం ముగిసేదాకా జైల్లో ఉండేందుకు వెనుకాడేది లేదన్నారు.

పార్టీలోకి ఎవరైనా రావచ్చు : హోం మంత్రి

బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉంటే కాంగ్రెస్‌ పార్టీలోకి రావచ్చునని రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌ పేర్కొన్నారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలోకి వచ్చేవారిని స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్‌ విధానాలకు అనుగుణంగా వ్యవహరించేవారికి అవకాశం ఉంటుందన్నారు. వారికి ఫస్ట్‌బెంచ్‌ ఉండదని, అయితే తరగతి గదిలోకి రావచ్చునన్నారు. ఫస్ట్‌బెంచ్‌ కావాలంటే ఎంతకాలమైనా పట్టవచ్చునని పేర్కొన్నారు. తనతో ఎమ్మెల్యేలు ఎవరూ చర్చించలేదని, అయి నా బహిరంగంగా ఇటువంటి అంశాలు పంచుకోలేమన్నారు.

పార్టీలోకి వస్తే చేర్చుకుంటాం : డీకే శివకుమార్‌

తమ పార్టీలోకి వచ్చేవారిని చేర్చుకుంటామని కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్‌ ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా సంక్షేమాలు అందించడం తమ లక్ష్యమన్నారు. లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-17T10:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising