BBC Documentary : మోదీ డాక్యుమెంటరీ వివాదంపై ఎలన్ మస్క్ వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-04-12T18:09:52+05:30
బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ఇ టీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ )పై ప్రసారం చేసిన డాక్యుమెంటరీని
న్యూఢిల్లీ : బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై ప్రసారం చేసిన డాక్యుమెంటరీని ట్విటర్ నుంచి ఎందుకు తొలగించారో తనకు తెలియదని ట్విటర్ సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) చెప్పారు. అయితే భారత దేశంలో సోషల్ మీడియా కంటెంట్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయని తెలిపారు.
2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన డాక్యుమెంటరీని బీబీసీ జనవరిలో ప్రసారం చేసింది. ‘‘ఇండియా : ది మోదీ క్వశ్చన్’’ పేరుతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. దీనికి సంబంధించిన లింకులతో కూడిన సుమారు 50 ట్వీట్లను తొలగించాలని ట్విటర్ ఇండియాను భారత ప్రభుత్వం కోరింది. దీంతో ఆ ట్వీట్లను మన దేశంలోని ట్విటర్ నుంచి తొలగించారు. ఈ డాక్యుమెంటరీని మన దేశంలో ప్రసారం చేయలేదు, అయితే కొన్ని యూట్యూబ్ చానళ్లు దీనిని అప్‌లోడ్ చేశాయి.
ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ బీబీసీకి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మోదీ డాక్యుమెంటరీని ట్విటర్ నుంచి తొలగించడం గురించి తనకు తెలియదన్నారు. ఏం జరిగిందో కచ్చితంగా తనకు తెలియదన్నారు. సోషల్ మీడియా కంటెంట్‌కు సంబంధించిన నిబంధనలు భారత దేశంలో చాలా కఠినంగా ఉన్నట్లు తెలిపారు. భారత దేశంలో కంటెంట్‌ను ట్విటర్ చాలాసార్లు బ్లాక్ చేసిందని, సెన్సార్ చేసిందని చెప్పారు. అలా చేయకపోతే తమ ఉద్యోగులు జైలుకు వెళ్లవలసి వస్తుందన్నారు. దేశంలోని చట్టాలకు అతీతంగా తాము ప్రవర్తించలేమని చెప్పారు. ఉద్యోగులు జైలుకు వెళ్లడమా? చట్టాలను పాటించడమా? అనేవాటిలో తాము చట్టాలకు అనుగుణంగా నడచుకోవడాన్నే ఎంచుకుంటామని చెప్పారు. బీబీసీ ప్రసారం చేసిన మోదీ డాక్యుమెంటరీలో ఏం ఉందో తనకు తెలియదని చెప్పారు. అయితే ఈ సమస్య గురించి తాను విన్నానని, ట్విటర్‌కు సంబంధించి ప్రపంచంలోని అన్ని విషయాలను రాత్రికి రాత్రే చక్కదిద్దడం సాధ్యం కాదని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం
Varun Gandhi : యోగి ప్రభుత్వానికి వరుణ్ గాంధీ వినతి
Updated Date - 2023-04-12T18:09:52+05:30 IST