Bellary: పిచ్చి కుక్క వీరంగం.. 30 మందిపై దాడి

ABN , First Publish Date - 2023-02-08T11:48:59+05:30 IST

బళ్లారి(Bellary) నగరంలోని 30వ వార్డులో పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు ఇలా దాదాపు 30 మందిపై

 Bellary: పిచ్చి కుక్క వీరంగం.. 30 మందిపై దాడి

- బళ్లారి విమ్స్‌లో బాధితులకు చికిత్స

బళ్లారి(బెంగళూరు), ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): బళ్లారి(Bellary) నగరంలోని 30వ వార్డులో పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు ఇలా దాదాపు 30 మందిపై కాటు వేసింది. సోమవారం, మంగళవారం రెండు రోజులూ కౌల్‌బజార్‌లోని వట్టప్పగేరిలో ఎక్కువ మంది పిచ్చి కుక్క కాటుకు గురయ్యారు. బాధితులు కొందరు విమ్స్‌లో వైద్యం కోసం చేరగా మిగిలిన కొందరు దగ్గర్లొ ఉండే పీహెచ్‌సీలో సూది వేయించుకున్నారు. మంగళవారం ఒక్కరోజే కుక్కకాటు బాధితులు విమ్స్‌కు సూది కోసం దాదాపు 20 మంది ఒకరి వెంట ఒకరు రాగా డాక్టర్లకు అనుమానం వచ్చింది. పూర్తీ వివరాలు సేకరించి విషయం ఆసుపత్రి డైరెక్టర్‌కు సమాచారం ఇవ్వగా ఆయన డీసీకి, నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ రుద్రేష్‏కు సమాచారం అందించారు. వెంటనే నగర పాలిక సిబ్బంది పిచ్చికుక్క ఆచూకీ కోసం వేట కొనసాగించారు. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకూ వెతికినా పిచ్చికుక్క అచూకీ దొరక లేదని నగర కమిషనర్‌ రుద్రేష్‌ తెలిపారు. ఒకే ప్రాంతంలో పిచ్చికుక్క సుమారు 30 మందికి పైగా కాటు వేయడం ఈ ప్రాంత జనం భయాందోళనకు లోనవుతున్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నపిల్లలు, ఆరుబయట కూర్చున్న వృద్ధులు, వీధిలో బయట తిరుగుతున్న వారిని.. ఇలా కనిపించిన వారందరినీ కుక్క కాటేసి పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చికుక్కకాటు బాధితులు విమ్స్‌లో వైద్యం పొందుతున్న వారికి బళ్లారి నగర మేయర్‌ రాజేశ్వరి, కమిషనర్‌ రుద్రేష్‌ పరామర్శించారు.

ఇదికూడా చదవండి: రక్తంతో సీఎంకు లేఖలు

Updated Date - 2023-02-08T12:30:18+05:30 IST