ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bengaluru: శివమొగ్గలో దిగిన తొలి విమానం

ABN, First Publish Date - 2023-09-01T11:51:59+05:30

శివమొగ్గ విమానాశ్రయం(Shivamogga Airport)లో తొలివిమానం ల్యాండింగ్‌ ద్వారా మలెనాడు ప్రాంత ప్రజల

- మాజీ సీఎం యడియూరప్ప, మంత్రి ఎంబీ పాటిల్‌ పయనం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శివమొగ్గ విమానాశ్రయం(Shivamogga Airport)లో తొలివిమానం ల్యాండింగ్‌ ద్వారా మలెనాడు ప్రాంత ప్రజల సుధీర్ఘకాల కల నెరవేరింది. గురువారం బెంగళూరు నుంచి ఇండిగో విమానం శివమొగ్గకు చేరింది. ఉదయం 9.55 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరగా శివమొగ్గకు 11.05 విమానం చేరింది. తొలి విమానంలో మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa), రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌, ఎంపీ బీవై రాఘవేంద్ర, మాజీ మంత్రి అరగజ్ఞానేంద్ర, హరతాళు హాళప్ప, ఎమ్మెల్యేలు బీవై విజయేంద్ర, బేళూరు గోపాలకృష్ణ తదితరులు ప్రయాణించారు. శివమొగ్గలో సోగాన వద్ద రూ.450 కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించారు. రాష్ట్రంలో బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు తర్వాత అతిపెద్ద రన్‌వే కలిగింది ఇక్కడే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 27న మాజీ సీఎం యడియూరప్ప జన్మదినం రోజునే ప్రారంభించారు. రాష్ట్ర రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన యడియూరప్ప సొంతూరు శివమొగ్గలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆశయంతోనే సాధించారు.

బెంగళూరు- శివమొగ్గ(Bangalore- Shivamogga)కు రూ.2,699లుగా టికెట్‌ ధర నిర్ణయించారు. ఇండిగో సంస్థ విమాన సర్వీసులు నిర్వహించేందుకు అనుమతులు పొంది జూలై 26 నుంచి టికెట్లు బుకింగ్‌ను ప్రారంభించింది. శివమొగ్గలో నిర్మించిన విమానం మలెనాడు ప్రాంతానికి ఏకైక విమానం కాగా ఉడుపి, చిక్కమగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, హావేరి, హుబ్బళ్లి(Udupi, Chikkamagalur, Chitradurga, Davangere, Haveri, Hubballi)తో పాటు తీర ప్రాంత జిల్లాల వాసులకు అనుకూలం కానుంది. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కాగానే పెద్దఎత్తున స్థానికులు చేరి హర్షధ్వనాలు పలికారు. ఇదే సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాలనేది తన ఆశయమే అయినా రైతులు భూములు ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేకుండా సహకరించారని కొనియాడారు.

Updated Date - 2023-09-01T11:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising