Bengaluru: బాంబు పేల్చిన బీజేపీ నేత.. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం కూలుతుంది..
ABN, First Publish Date - 2023-11-05T13:27:36+05:30
రాష్ట్రంలో కాంగ్రె్‌సకు చెందిన సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అధిష్టానం పెద్దల టచ్‌లో ఉన్నారని, ఏ క్షణంలో అయినా
50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రె్‌సకు చెందిన సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అధిష్టానం పెద్దల టచ్‌లో ఉన్నారని, ఏ క్షణంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉందని మాజీ మంత్రి, బీజేపి సీనియర్ నేత మురుగేష్ నిరాణి(Former minister and senior BJP leader Murugesh Nirani) సరికొత్త బాంబు పేల్చారు. విజయపురలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రస్తుతం మూడు, నాలుగు గ్రూపులుగా చీలిపోయిందని, సీఎం పదవి విషయంలో ఆ పార్టీలో అసంతృప్తి తారస్థాయికి చేరుకుందని వ్యాఖ్యానించారు. మంత్రి పదవులు దక్కని సు మారు రెండు డజన్ల మందికి పైగా కాంగ్రెస్ ఎ మ్మెల్యేలు బీజేపి అధిష్టానంతో మాట్లాడుతున్నారని, సరైన సమయయంలో వీరి పేర్లను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఐదేళ్లు సాగబోదన్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు తార్కారణమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు ఏకోశానా లేదని, అది దానతంట అదే కుప్పకూలనుందని నిరాణి జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కాగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిపై తాను కన్నేసినట్లు వస్తున్న కథనాల్లో నిజం లేదన్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనన్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి నిరాణి వ్యాఖ్యలపై స్పందించేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థ నారాయణ నిరాకరించారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, అయితే 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
దమ్ముంటే ఒక్కపేరు చెప్పండి చాలు: డీసీఎం
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని కేపీసీసీ అధ్యక్షుడు కూడా అయిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) స్పష్టం చేశారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిని ఎవరైనా ఆశించడంలో తప్పేమీ లేదని, అయితే పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని చెప్పారు. లక్ష్మణ రేఖ దాటిన ఎమ్మెల్యేలకు నోటీసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ ఆ పార్టీ నేత మురుగేష్ నిరాణి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దమ్ముంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. శాసనసభ ఎన్నికల్లో సంభవించిన ఘోర పరాజయాల షాక్ నుంచి ఇంకా తేరుకోని బీజేపీ నే తలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చురకలంటించారు.
Updated Date - 2023-11-05T13:27:38+05:30 IST