ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra: లాల్‌‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేసిన రాహుల్

ABN, First Publish Date - 2023-01-29T14:36:17+05:30

రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' చివరి మజిలీగా శ్రీనగర్‌లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra) చివరి మజిలీగా శ్రీనగర్‌లో ఆదివారం కొనసాగుతోంది. ప్రఖ్యాత లాల్ చౌక్ (Lal Chowk)లో జాతీయ జెండాను (Natioanal Flag) రాహుల్ గాంధీ ఎగురవేశారు. సోనావార్‌లో 30 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారని, అక్కడ నుంచి 'ఘంటా ఘర్'గా అత్యంత ప్రాచుర్యం ఉన్న క్లాక్ టవర్ చేరుకుని జాతీయ జెండా ఎగురవేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

లాల్‌చౌక్ వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసిన కార్యక్రమంలో రాహుల్ వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. 10 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరగగా, భద్రతా కారణాల దష్ట్యా లాల్‌చౌక్‌కు దారితీసే అన్ని రోడ్లను సీల్ చేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ముందస్తుగా దుకాణాలు, వాణిజ్య సంస్థలు, వారాంతపు మార్కెట్‌లు మూతపడ్డాయి. సెక్యూరిటీ డ్రిల్ సైతం నిర్వహించారు.

నెహ్రూ పార్క్ వద్ద ముగియనున్న యాత్ర...

కాగా, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా 75 జిల్లాల మీదుగా 4,080 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమై 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగింది. చివరి మజిలీగా జమ్మూకశ్మీర్‌లో పర్యటన సాగుతోంది. శ్రీనగర్‌లోని బౌలెవార్డ్ ప్రాంతంలోని నెహ్రూ పార్క్‌ వద్దకు యాత్ర చేరుకోగానే యాత్ర ముగుస్తుందని చెబుతున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లలో పర్యటించింది. ఇది రాజకీయ యాత్ర కాదని, దేశంలో పెరుగుతున్న విద్వేషాలకు దూరంగా దేశాన్ని ఐక్యంగా ఉంచడమే భారత్ జోడో ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ చెబుతుండగా, దేశం ఇప్పుడేమీ విడిపోయి లేదని, భారత్ జోడో వెనుక దేశాన్ని విడగొట్టే ఉద్దేశం కనిపిస్తోందని బీజేపీ కొట్టిపారేస్తోంది. అయితే, భారత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన వస్తుండటం, అనేక మంది ప్రముఖులు వివిధ ప్రాంతాల్లో రాహుల్‌తో కలిసి ముందడుగు వేయడం, మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంద

Updated Date - 2023-01-29T14:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising