ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nitish Kumar : జనాభాపై నితీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-08T16:40:54+05:30

మహిళలు విద్యావంతులు కాకపోవడంతోపాటు పురుషులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జనాభా నియంత్రణ

Nitish Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : మహిళలు విద్యావంతులు కాకపోవడంతోపాటు పురుషులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జనాభా నియంత్రణ సాధ్యంకావడం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేపట్టిన ‘సమాధాన్ యాత్ర’ (Samadhan Yatra)లో భాగంగా వైశాలిలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మహిళలు చదువుకుంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతుందన్నారు. ఇది వాస్తవమని, నేడు మహిళలు చదువుకోవడం లేదని అన్నారు. ప్రతిరోజూ పిల్లల్ని కనకూడదనే విషయాన్ని పురుషులు తమ మనసులో పెట్టుకోవడం లేదన్నారు. మహిళలు విద్యావంతులైతే, లేదా, గర్భధారణను నిరోధించేందుకు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించాలో తెలిస్తే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.

నితీశ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గురించి వివరించడానికి సరైనది కానటువంటి భాషను ఆయన ఉపయోగించారని ఆరోపించింది. బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఇచ్చిన ట్వీట్‌లో, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అమర్యాదకరమైన భాషను బహిరంగంగా ఉపయోగించారని ఆరోపించారు. ఇటువంటి భాషను ఉపయోగించడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి పదవి ఔన్నత్యానికి కళంకం తెస్తున్నారన్నారు.

Updated Date - 2023-01-08T16:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising