BJP, Congress: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..?
ABN, First Publish Date - 2023-08-27T11:35:48+05:30
ఘర్‌వాపసికి బ్రేక్ పడిందని భావిస్తున్న తరుణంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరాం హెబ్బార్(BJP MLAs ST S
- సీఎంతో బీజేపీ ఎమ్మెల్యేల రహస్య భేటీ
- రేణుకాచార్యకు గ్రీన్‌సిగ్నల్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఘర్‌వాపసికి బ్రేక్ పడిందని భావిస్తున్న తరుణంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరాం హెబ్బార్(BJP MLAs ST Somasekhar and Shivram Hebbar) మరోసారి ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలవడం కలకలం రేపింది. బీజేపీలో మూడున్నరేళ్లపాటు మంత్రులుగా కొనసాగిన వీరిద్దరు వారం రోజులక్రితమే మరోసారి సొంతగూడు కాంగ్రె్‌సలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈలోగానే బీజేపీ రాష్ట్ర ముఖ్యనేత యడియూరప్ప అప్రమత్తమై ఇద్దరితోనూ చర్చించారు. దీంతో వారు బీజేపీని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వివాదం సద్దుమణిగిందని బీజేపీ వర్గాలు భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఇద్దరు నేతలు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)ను కలవడం సర్వత్రా చర్చనీయాంశమయింది. ఇప్పటికే సీఎంను కలసిన సందర్భంలో ఎస్‌టీ సోమశేఖర్‌కు పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే లోక్‌సభ ఎన్నికల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని, అంతకాలం పదవి లేకుండా కొనసాగడం వద్దని సూచించినట్టు తెలిసింది. కాగా, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఇటు సీఎం, అటు డీసీఎంలతోపాటు దావణగెరె జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎస్‌ఎస్ మల్లికార్జున్‌తో వరుస భేటీలు కావడం కూడా చర్చనీయాంశమయింది. ఆయన సీఎంను కలిసే ముందే రాజకీయ గురువు యడియూరప్పను కలసి ఇక పార్టీలో కొనసాగలేనని వివరించినట్టు తెలుస్తోంది. రేణుకాచార్య కాంగ్రె్‌సలో చేరడం దాదాపు ఖరారైంది. త్వరలో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతలు తీసుకోవాలని, ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు గురించి తగిన గుర్తింపు ఇస్తామని సీఎం భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.
Updated Date - 2023-08-27T11:35:48+05:30 IST