Rahul Gandhi : రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి : బీజేపీ

ABN, First Publish Date - 2023-03-21T12:32:04+05:30

భారత దేశంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)ని బీజేపీ డిమాండ్ చేసింది.

Rahul Gandhi : రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి : బీజేపీ
Rahul Gandhi , Sambit Patra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : భారత దేశంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)ని బీజేపీ డిమాండ్ చేసింది. రాహుల్ భారత దేశ రాజకీయాల్లో నేటి కాలపు మీర్ జాఫర్ (Mir Jafar) అని వ్యాఖ్యానించింది. ఇటీవల బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత దేశ ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.

రాహుల్ గాంధీ మార్చి మొదటి వారంలో లండన్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఛాటమ్ హౌస్ (Chatham House)లో ఆయన మాట్లాడుతూ, భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్ష నేతల మైక్‌లు తరచూ మూగబోతాయన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్‌లోని అనేక వ్యవస్థలకు ముప్పు ఉందని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓ ఛాందసవాద సంస్థ, ఫాసిస్ట్ సంస్థ అని ఆరోపించారు. భారత దేశంలోని దాదాపు అన్ని వ్యవస్థలను ఆరెస్సెస్ (RSS) కబ్జా చేసిందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా (Sambit Patra) మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ పార్లమెంటు (Parliament)లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఎల్లప్పుడూ దేశాన్ని కించపరుస్తున్నారన్నారు. భారత దేశ రాజకీయాల్లో నేటి కాలపు మీర్ జాఫర్‌గా రాహుల్ వ్యవహరిస్తున్నారన్నారు. రాహుల్ దేశాన్ని అవమానించారని, భారత దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశాలను కోరారని చెప్పారు. ఇది కాంగ్రెస్ (Congress), రాహుల్ గాంధీ కుట్ర అని ఆరోపించారు. పార్లమెంటులో ఆయన భాగస్వామ్యం చాలా తక్కువ అని తెలిపారు. తనను ఎవరూ మాట్లాడనివ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారన్నారు. మీర్ జాఫర్ చేసినదానికి ఇది భిన్నమైనదేమీ కాదన్నారు. తాను పరిపాలించాలనే కోరిక మీర్ జాఫర్‌ (Mir Jafar)కు ఉండేదని, ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఈస్టిండియా కంపెనీ సహాయాన్ని పొందాడని చెప్పారు. ఆ తర్వాత భారత దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలించారన్నారు.

చర్చ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని చెప్పారు. 2019 నుంచి రాహుల్ గాంధీ కేవలం ఆరు సార్లు మాత్రమే పార్లమెంటు చర్చల్లో పాల్గొన్నారని చెప్పారు. ఆయన చర్చల్లో పాల్గొనడం లేదన్నారు.

‘‘దురదృష్టవశాత్తూ నేను ఎంపీని’’ అని రాహుల్ గాంధీ చెప్పడంపై కూడా సంబిత్ పాత్రా మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో తెలియదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సహాయంతోనే ఆయన మాట్లాడతారన్నారు. ‘‘నేను దురదృష్టవశాత్తూ ఎంపీని’’ అని ఆయనే అంటున్నారన్నారు.

ఇవి కూడా చదవండి :

2024 Lok Sabha Polls : బీజేపీని ఓడించడం అసాధ్యం, అయితే ... : ప్రశాంత్ కిశోర్

Amazon : అమెజాన్‌లో ఉద్యోగాల కోత... మరో 9,000 మంది ఉద్యోగులు ఇంటికే...

Updated Date - 2023-03-21T12:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising