ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: ఒక్కసారి మాట్లాడదాం రండి.. అన్నాడీఎంకే నేతలకు బీజేపీ అగ్రనేతల ఆహ్వానం!

ABN, First Publish Date - 2023-10-04T09:03:00+05:30

అన్నాడీఎంకే-బీజేపీ(AIADMK-BJP) మధ్య పొత్తుల కథ ఇంకా కంచికి చేరినట్లు కనిపించడం లేదు. ఈ బంధాన్ని కొనసాగించేందుకు బీజేపీ

- హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన నలుగురు నేతలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే-బీజేపీ(AIADMK-BJP) మధ్య పొత్తుల కథ ఇంకా కంచికి చేరినట్లు కనిపించడం లేదు. ఈ బంధాన్ని కొనసాగించేందుకు బీజేపీ నుంచి తీవ్ర ప్రయత్నాలు జరుగుతుండగా, అన్నాడీఎంకే మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు 50 శాతం సీట్లు కావాలని డిమాండ్‌ చేయడంతో పాటు తమ నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తుండడంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారంటూ ప్రకటించిన అన్నాడీఎంకే.. బీజేపీతో పొత్తుకు కటీఫ్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఇకపై భవిష్యత్తుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని అన్నాడీఎంకే సీనియర్‌ నేత కేపీ మునుస్వామి ప్రకటించగా, 2 కోట్ల మంది కార్యకర్తల అభీష్టం మేరకే పొత్తు వద్దనుకున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వివరణ ఇచ్చుకున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయినట్లేనని పలు వర్గాలు భావించాయి కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మంగళవారం అధికారిక కార్యక్రమాల కోసం కోయంబత్తూరు వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను అన్నాడీఎంకేకు చెందిన పొల్లాచ్చి ఎమ్మెల్యే పొల్లాచ్చి జయరామన్‌, వాల్పారై ఎమ్మెల్యే అమల్‌ కందస్వామి, మేట్టుపాళయం ఎమ్మెల్యే ఏకే సెల్వరాజ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాము కేవలం తమ నియోజకవర్గాలకు నిధులు, తమ ప్రాంతంలో ప్రధాన వృత్తిగా ఉన్న కొబ్బరి పరిశ్రమ సమస్యలపై కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చినప్పటికీ అనుమానాలు వీడడం లేదు. ఇప్పుడు కొత్తగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వినతిపత్రం ఇచ్చినంత మాత్రాన కేంద్రం నుంచి వచ్చిపడేదేమీ లేదని, ఏదో మతలబు ఉండబట్టే వారు ఆమెతో భేటీ అయ్యారని రాజకీయవర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఢిల్లీ నుంచి పిలుపు

ఈ చర్చ జరుగుతుండగానే మంగళవారం సాయంత్రం అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, నత్తం విశ్వనాఽథన్‌, కేపీ మునుస్వామి, సీవీ షణ్ముగం హడావుడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒక్కసారి మాట్లాడదాం రండంటూ బీజేపీకి అగ్రనేతల నుంచి వచ్చిన పిలుపు మేరకే ఆ నలుగురు నేతలు వెళ్లినట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. వీరు బుధవారం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులతో భేటీ కానున్నట్లు తెలిసింది. అయితే దీనిపై అన్నాడీఎంకే నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. పొత్తులపై చర్చించేందుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు రాజకీయవర్గాలు అనుమానిస్తున్నాయి. పొత్తు విచ్ఛిన్నానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇప్పటికే ఢిల్లీలో వున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన పాదయాత్ర సైతం వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.

చర్చలు జరుగుతున్నాయ్‌...

- బీజేపీ ఉపాధ్యక్షుడు వీపీ దురైస్వామి

అన్నాడీఎంకేతో కూటమి కొనసాగింపుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీపీ దురైస్వామి పేర్కొన్నారు. స్థానిక టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. పార్టీ వ్యవరాహాల ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్రిసీడియం కార్యదర్శి కేశవ వినాయగన్‌, వీపీ దురైస్వామి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం వీపీ దురైస్వామి మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు కుదుర్చుకొనే అంశంపై రాష్ట్ర సీనియర్‌ నేతలందరూ చర్చించారని తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై తగిన సమయంలో స్పందిస్తామన్నారు.

అవి ఊహాగానాలే...

- కేపీ మునుస్వామి

అన్నాడీఎంకేతో కూటమికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వీపీ దురైస్వామి ప్రకటించడంపై అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కేపీ మునుస్వామి మంగళవారం ఉదయం స్పందించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి బీజేపీతో పొత్తు లేదని చేసిన ప్రకటనలో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదని తేల్చిచెప్పారు. కానీ బీజేపీ అగ్రనేతల ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లినవారిలో కేపీ మునుస్వామి కూడా ఉండడం గమనార్హం.

Updated Date - 2023-10-04T09:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising