ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka : జూన్ 1 నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు : బీజేపీ ఎంపీ

ABN, First Publish Date - 2023-05-25T21:18:34+05:30

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు ప్రారంభమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి నెలకు 200 యూనిట్ల కన్నా

BJP Mysur MP Pratap Simha
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు ప్రారంభమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును వినియోగించేవారు జూన్ 1 నుంచి విద్యుత్తు బిల్లులను చెల్లించొద్దని బీజేపీ నేత, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ ప్రజలను కోరారు. ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్తును అందజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 224 స్థానాలున్న కర్ణాటక శాసన సభలో 135 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. డీకే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలనూ త్వరలోనే అమలు చేస్తామని నూతన ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఈ హామీల అమలుకు జూన్ 1 వరకు సమయం ఇస్తామని బీజేపీ ప్రకటించింది. ఎటువంటి షరతులు లేకుండా అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. జూన్ నాటికి ఉచిత విద్యుత్తు హామీని అమలు చేయకపోతే, తాము వీథి పోరాటాలు చేస్తామని హెచ్చరించింది. బీజేపీ నేత, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ (Pratap Simha) గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాను మైసూరు-కొడగు ప్రాంతంలో ధర్నా చేస్తానని చెప్పారు. ఒక కుటుంబం నెలకు 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్తును వాడుకుంటే, అందులో 200 యూనిట్లను ఉచితంగా పరిగణించాలని, మిగిలిన యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును ఉపయోగించేవారు జూన్ 1 నుంచి బిల్లులు చెల్లించవద్దని చెప్పారు. 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తు సిద్ధరామయ్యకు కూడా ఉచితమేనని ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన పేదవారు కాదని, అంటే ఇది అందరికీ ఉచితమేనని అర్థమవుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Amul : తమిళనాడులో అమూల్ పాల సేకరణ మానుకోవాలి : స్టాలిన్

Delhi Development : మోదీ హయాంలో రూ.1.5 లక్షల కోట్లతో ఢిల్లీ అభివృద్ధి : బీజేపీ

Updated Date - 2023-05-25T21:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising