BJP state president: మంత్రి బర్త్‌డేకి 812 మంది పోలీసులతో భద్రతా?
ABN, First Publish Date - 2023-11-28T09:56:58+05:30
రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన నివాస గృహం, పరిసర ప్రాంతాలు, రహదారుల్లో
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు అన్నామలై విమర్శ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన నివాస గృహం, పరిసర ప్రాంతాలు, రహదారుల్లో 800 వందల మందికిపైగా పోలీసులతో భద్రత కల్పించడం భావ్యమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తన ఎక్స్ పేజీలో ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలోనే ఓ మంత్రి జన్మదిన వేడుకలకు ఇంత భారీ ఎత్తున పోలీసు భద్రత కల్పించిన దాఖలాలు లేవన్నారు. పోలీసు శాఖ పాలకులకు మద్దతుగానే వ్యవహరిడంలో తలమునకలవుతోందనడానికి ఉదయనిధికి కల్పించిన భద్రతే సాక్ష్యమని తెలిపారు. ఇద్దరు డిప్యూటీ పోలీసు కమిషనర్లు, 10 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 30 మంది ఇన్‌స్పెక్టర్లు, 90 మంది ఎస్‌ఐలు, 300 మంది పోలీసు అధికారులు, 380 మంది ప్రత్యేక దళం పోలీసులు ఉదయనిధి నివాసగృహం భద్రతా విధుల్లో పాల్గొన్నారని, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని అన్నామలై మండిపడ్డారు.
Updated Date - 2023-11-28T09:57:00+05:30 IST