ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BSP supremo : అదానీ గ్రూప్‌పై ఆరోపణలు... కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన మాయావతి...

ABN, First Publish Date - 2023-01-28T19:33:50+05:30

అదానీ గ్రూప్ నిస్సిగ్గుగా స్టాక్ మానిప్యులేషన్‌, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన

Mayawati
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి శనివారం డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడిందని, గణతంత్ర దినోత్సవాల గురించి మాట్లాడుకోవడం కన్నా ఎక్కువగా వీటి గురించే ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. దేశంలోని కోట్లాది మంది తమ కష్టార్జితాన్ని ఈ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారన్నారు.

అదానీ గ్రూప్ నిస్సిగ్గుగా స్టాక్ మానిప్యులేషన్‌, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఆరోపించింది. ఈ ఆరోపణలు దురుద్దేశపూర్వకమైనవని, నిరాధారమైనవని అదానీ గ్రూప్ ప్రకటించింది. వాటాల అమ్మకాలను నాశనం చేయాలనే లక్ష్యంతో ఏకపక్షంగా ఈ ఆరోపణలు చేసిందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో మాయావతి (BSP Supremo Mayawati) ట్విటర్ వేదికగా స్పందించారు. అదానీ గ్రూప్ (Adani Group) విషయంలో అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ (Hindenburg Research) ఇచ్చిన నెగెటివ్ రిపోర్ట్, స్టాక్ మార్కెట్‌పై దాని ప్రభావాల గురించి గడచిన రెండు రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారన్నారు గణతంత్ర దినోత్సవాల గురించి కన్నా ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది కోట్లాది మంది ప్రజల కష్టార్జితానికి సంబంధించిన విషయమని, కానీ ప్రభుత్వం మౌనంగా ఉందని అన్నారు.

షేర్లలో మోసాలు వంటి ఆరోపణలు వచ్చిన తర్వాత అదానీ ఆస్తులు, ప్రపంచ ర్యాంకింగ్ తగ్గిపోయాయన్నారు. అదానీ గ్రూప్‌లో ప్రభుత్వం పెట్టిన భారీ పెట్టుబడులకు ఏం జరుగుతుందోనని ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ప్రజలు ఆందోళనకు గురికావడం సహజమేనన్నారు. అయితే పరిష్కారం అవసరమని స్పష్టం చేశారు. ప్రజల ఆందోళనకు తెర పడే విధంగా ఓ ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే ఉభయ సభల్లోనూ దీనిపై సవివరంగా ఓ ప్రకటన చేయాలన్నారు. ముఖ్యంగా పట్టణ మధ్య తరగతి ప్రజల్లో ఆందోళనను తగ్గించే విధంగా ప్రకటన చేయాలని కోరారు.

Updated Date - 2023-01-28T19:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising