ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budget 2023: రైల్వేలకు పెద్ద పీట... గత సంవత్సరం కన్నా నాలుగు రెట్ల బడ్జెట్...

ABN, First Publish Date - 2023-02-01T13:29:32+05:30

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. ఈ బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట వేశారు. దాదాపు ఓ దశాబ్దంలో అత్యధికంగా, గత ఏడాది కన్నా నాలుగు రెట్ల వరకు ఈ రైల్వే బడ్జెట్ ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టడానికి ముందు యూపీఏ ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ వ్యయం చేయబోతున్నట్లు నిర్మల తెలిపారు.

Nirmala Sitharaman
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. ఈ బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట వేశారు. దాదాపు ఓ దశాబ్దంలో అత్యధికంగా, గత ఏడాది కన్నా నాలుగు రెట్ల వరకు ఈ రైల్వే బడ్జెట్ ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టడానికి ముందు యూపీఏ ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ వ్యయం చేయబోతున్నట్లు నిర్మల తెలిపారు.

పార్లమెంటులో నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ, 2013-14 బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయించినదాని కన్నా తొమ్మిది రెట్లు, అంటే రూ.2.4 లక్షల కోట్లు 2023-24 బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. రైల్వేల అభివృద్ధికి దోహదపడే మరొక పథకాన్ని కూడా ఆమె ప్రకటించారు. 100 క్రిటికల్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు, వీటి కోసం రూ.75,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నౌకాశ్రయాలు, బొగ్గు క్షేత్రాలు, ఎరువుల కంపెనీలు, ఆహార ధాన్యాల గోదాములు వంటివాటిని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తారు. రూ.15,000 కోట్ల పెట్టుబడులను సేకరించేందుకు ప్రైవేట్ రంగం సహకారం కూడా తీసుకుంటారు.

ఇదిలావుండగా, మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే నివేదిక రైల్వేలను అభినందించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రయాణికులు, సరుకు రవాణా రంగాల్లో రైల్వేలు తిరిగి కోలుకున్నాయని ఈ నివేదిక తెలిపింది. మరోవైపు ప్రభుత్వం కూడా రైల్వేలకు తగిన నిధులను అందజేసినట్లు పేర్కొంది.

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రయాణికుల ప్రయాణ సమయం, సరుకు రవాణా సమయం తగ్గినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని, ఈ బడ్జెట్ అందుకు దోహదపడుతుందని బీజేపీ నేత వై సత్య కుమార్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ బడ్జెట్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ బచత్ పత్ర (Mahila Samman Bachat Patra) పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్ టైమ్ చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అవసరమైనపుడు పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు.

Updated Date - 2023-02-01T13:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising