Budget 2023 : నిర్మల సీతారామన్ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణ
ABN, First Publish Date - 2023-02-01T10:49:42+05:30
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) 2023-24 కేంద్ర బడ్జెట్‌ను బుధవారం పార్లమెంటుకు సమర్పించబోతున్నారు.
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) 2023-24 కేంద్ర బడ్జెట్‌ను బుధవారం పార్లమెంటుకు సమర్పించబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె అత్యంత ఆకర్షణీయమైన, సంప్రదాయ వస్త్రాలు ధరించి, పార్లమెంటుకు హాజరయ్యారు. ఆమెకు భారతీయ సంప్రదాయ వస్త్రాలంటే చాలా ఇష్టమనే సంగతి అందరికీ తెలుసు. ఆమె సంప్రదాయబద్ధమైన టెంపుల్ బోర్డర్ ఎరుపు రంగు చీరను ధరించి, పార్లమెంటుకు హాజరయ్యారు. టెంపుల్ చీరలను సాధారణంగా నూలు, పట్టు లేదా ఈ రెండిటి మిశ్రమంతో తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుని ధరిస్తారు. నిర్మల ధరించిన చీరపై నల్లని రంగు బోర్డర్, ఇంట్రికేట్ గోల్డెన్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదిలావుండగా, నిర్మల ప్రవేశపెడుతున్న ఐదో బడ్జెట్ ఇది. సాధారణ ప్రజానీకం ఆశలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సమతుల్యతను పాటించడం ఆమెకు తీగపై నడవటం వంటిదేననడంలో సందేహం లేదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌పై చర్చను ప్రారంభించింది. కేబినెట్ ఈ బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటుకు సమర్పిస్తారు.
Updated Date - 2023-02-01T12:15:02+05:30 IST