ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bus Accident: అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బస్సు.. నలుగురు మృతి

ABN, First Publish Date - 2023-11-06T08:02:40+05:30

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.

జైపూర్: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 28 మందిని ఆసుపత్రికి తరలించారు. వారందరికీ చికిత్స అందిస్తుండగానే నలుగురు ప్రాణాలు విడిచారు. గాయపడిన మిగతా వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా గాయపడ్డారు. ‘‘ప్రమాదం జరిగిన తరువాత గాయపడిన 28 మందిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వెంటనే వారందరికీ వైద్యులు చికిత్స ప్రారంబించారు. కానీ చికిత్స పొందుతూనే నలుగురు మరణించారు. గాయపడిన మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది. బస్సు ప్రమాదం గురించి విచారణ చేయడానికి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు" అని దౌసా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజ్‌కుమార్ కస్వా తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై రాజకీయ నాయకులతోపాటు అధికారులు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-11-06T08:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising