ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CBI Notices Aravind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా సీఎంకే..

ABN, First Publish Date - 2023-04-14T18:04:49+05:30

దేశవ్యాప్తంగా కొన్ని నెలల నుంచి తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ కేసులో (Delhi Liquor Scam Case) శుక్రవారం (ఏప్రిల్ 14, 2023) కీలక పరిణామం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొన్ని నెలల నుంచి తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ కేసులో (Delhi Liquor Scam Case) శుక్రవారం (ఏప్రిల్ 14, 2023) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు (CBI Notices Aravind Kejriwal) పంపింది. ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు (Delhi CM Kejriwal) సీబీఐ స్పష్టం చేసింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణ జరిగే అవకాశం ఉంది. సీబీఐ పంపిన నోటీసులపై కేజ్రీవాల్ ఎలా స్పందించనున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సీబీఐ విచారణకు కేజ్రీవాల్ వెళతారా లేక ఏవైనా కారణాలను చూపి గైర్హాజరవుతారా అనే చర్చ మొదలైంది.

ఇదిలా ఉండగా.. 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. పబ్లిక్ ప్రాపర్టీస్‌పై అక్రమంగా ఆప్ పోస్టర్లు అంటించారని, ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకావాలని గోవా పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 27 లోపు విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌కు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. గోవా పోలీసులు పంపిన ఈ నోటీసులపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను వెళతానని, తప్పకుండా వెళతానని వెల్లడించారు. తాజాగా మద్యం కుంభకోణం కేసులో సీబీఐ కూడా కేజ్రీవాల్‌కు సమన్లు పంపడంతో దేశవ్యాప్తంగా మరోసారి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఇప్పటికే నాటకీయ పరిణామాల మధ్య ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రశ్నించింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ అగ్రనేతల్లో ఒకరైన మనీష్ సిసోడియాను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం సిసోడియా బెయిల్ పిటిషన్ కోర్టులో విచారణ దశలో ఉంది. ఆయన తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా సీబీఐ సమన్లు అందుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కూడా ఈ కేసులో నేరుగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Updated Date - 2023-04-14T18:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising