ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jobs scam: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌కు సీబీఐ సమన్లు

ABN, First Publish Date - 2023-03-11T11:27:58+05:30

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ కు శనివారం సమన్లు జారీ చేసింది....

Bihar deputy CM Tejashwi Yadav
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ కు శనివారం సమన్లు జారీ చేసింది.(CBI summons)భూములు తీసుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చిన కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను(Bihar deputy CM Tejashwi Yadav) సీబీఐ విచారణకు పిలిచింది. బీజేపీ సర్కారు తమ కుటుంబాన్ని వేధిస్తుందని గతంలో తేజస్వీ ఆరోపించారు.రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు యాదవ్‌కు గతంలో ఫిబ్రవరి 4న సీబీఐ సమన్లు జారీ చేసినా ఆయన దర్యాప్తు సంస్థ ముందు హాజరుకాలేదు.

ఇది కూడా చదవండి :Karnataka: కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్రువనారాయణ్‌కు గుండెపోటు

భూముల కుంభకోణం కేసుకు(land-for-jobs scam) సంబంధించి మార్చి 10న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీలోని తేజస్వి యాదవ్ నివాసంలో దాడులు నిర్వహించింది.ఈ కేసుకు సంబంధించి లాలూ యాదవ్ మరియు అతని భార్యను సీబీఐ వరుసగా ఢిల్లీ, పాట్నాలో ప్రశ్నించింది.తేజస్వి యాదవ్ ఢిల్లీ ఇంటిపై ఈడీ దాడులపై లాలూ కుమార్తె మండిపడ్డారు.‘‘బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయని, బీజేపీతో పొత్తుకు అంగీకరించే వారికి సహాయం చేస్తున్నాయనేది బహిరంగ రహస్యం’’ అని తేజస్వి యాదవ్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి : Dog Saves Owner: యజమానిని పాము కాటు నుంచి కాపాడిన శునకం

లాలూయాదవ్ కుటుంబానికి, అతని సహచరులకు బహుమతిగా లేదా తక్కువ ధరలకు విక్రయించిన భూములకు బదులుగా రైల్వేలో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తులకు సంబంధించిన కేసు అని సీబీఐ అధికారులు తెలిపారు.లాలూప్రసాద్, ఆయన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నిందితులందరికీ మార్చి 15న సమన్లు జారీ చేసింది.

Updated Date - 2023-03-11T11:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising