ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chhattisgarh Opinion Poll 2023: ఛత్తీస్‌గఢ్‌లో గెలవబోయేది ఎవరంటే?

ABN, First Publish Date - 2023-03-26T20:25:58+05:30

ఈ ఏడాదిలో జరిగే ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికలు (Chhattisgarh assembly polls)లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉన్నట్లు

Bhupesh Baghel (Congress), Raman Singh (BJP)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ఈ ఏడాదిలో జరిగే ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికలు (Chhattisgarh assembly polls)లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉన్నట్లు ఏబీపీ న్యూస్-మాట్రిజ్ (ABP News-Matrize) నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. ఎన్నికలనాటికి పరిస్థితి మారితే మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 90 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 46 మంది ఎమ్మెల్యేలు అవసరం. గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 68 స్థానాలు లభించగా, బీజేపీకి 15 స్థానాలు లభించాయి. ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ప్రస్తుతం 71 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఏబీపీ న్యూస్-మాట్రిజ్ ఒపీనియన్ పోల్‌లో ఓట్ షేర్‌ను చూస్తే, బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య తేడా కేవలం ఒక శాతం మాత్రమే కనిపిస్తోంది. ఎన్నికలనాటికి మొగ్గు పెరిగితే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉండవచ్చు. కాంగ్రెస్ ఓట్ షేర్ 44 శాతం కాగా, బీజేపీ ఓట్ షేర్ 43 శాతం ఉంది. కాంగ్రెస్‌కు 47 నుంచి 52 స్థానాలు లభించవచ్చునని, బీజేపీకి 34 నుంచి 39 స్థానాలు లభించవచ్చునని ఈ సర్వే నివేదిక చెప్తోంది. చివరి క్షణంలో ఓటింగ్ విధానం మారితే బీజేపీకి సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

బీఎస్‌పీ, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీలు 3 శాతం నుంచి 5 శాతం వరకు ఓట్లను సాధించగలిగితే, అవి కూడా ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ పాత్రను పోషించే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ సంవత్సరం జరిగే శాసన సభ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమైనవి. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా వీటిని పరిశీలకులు భావిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్‌కు అకల్ తఖ్త్ జతేదార్ వీడియో మెసేజ్

Amit Shah : రిజర్వేషన్లకు మత ప్రాతిపదిక... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు...

Updated Date - 2023-03-26T21:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising