ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: అన్నామలైను తొలగించాల్సిందే.. లేకుంటే పొత్తు కష్టమే!

ABN, First Publish Date - 2023-09-24T08:02:32+05:30

అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) మధ్య మళ్లీ వివాదం ముదురుతోంది. చీటికిమాటికి తమపై నోరు పారేసుకోవడంతో పాటు తమ నేతలను

- అన్నాడీఎంకే నేతల డిమాండ్‌

- కుదరదన్న బీజేపీ అధిష్ఠానం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) మధ్య మళ్లీ వివాదం ముదురుతోంది. చీటికిమాటికి తమపై నోరు పారేసుకోవడంతో పాటు తమ నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను తొలగించాల్సిందేనని ఆ పార్టీ అధిష్ఠానాన్ని అన్నాడీఎంకే డిమాండ్‌ చేసింది. లేకపోతే తమ రెండు పార్టీల మధ్య పొత్తును పునస్సమీక్షించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గత కొద్ది రోజులుగా అన్నాడీఎంకే - బీజేపీ కూటమిలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అన్నాడీఎంకే సీనియర్‌ నేతలైన ఎస్‌పీ వేలుమణి, తంగమణి, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్‌, సీవీ షణ్ముగం తదితరులు శుక్రవారం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. శనివారం వీరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో తమ పార్టీకి చెందిన దివంగత నేత అన్నాదురై గురించి అన్నామలై చేసిన వ్యాఖ్యలను, అంతకుముందు జయలలిత పట్ల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వివరించారు. అంతేగాక డీఎంకే నాయకులతో పాటు తమ పేర్లను కలిపి విమర్శలు గుప్పిస్తున్నారని, ఇలాగైతే మునుముందు ఆయన్ని వెంటబెట్టుకుని ప్రచారం చేయడం ఎలాగని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం కొన్ని నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు కూటమికి హాని కలిగిస్తాయని వివరించారు. అన్నామలై వ్యాఖ్యలతో తమ పార్టీ కింది క్యాడర్‌ తీవ్ర మనస్తాపంతో ఉందని, వారిని సముదాయించడం తమ వల్ల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటల్ని ఆలకించిన జేపీ నడ్డా.. అన్నామలైను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. కూటమి పార్టీగా ఉండి, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని అడగడమేంటని ఆయన నిలదీసినట్లు సమాచారం. ఇందుకు ఆ నేతలు వివరణ ఇవ్వబోయినా ఆయన పట్టించుకోలేదని, అందరూ ఎన్నికలపై దృష్టి సారించాలంటూ సూచించి వెళ్లిపోయారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అన్నాడీఎంకే నేతలు.. వాడిన ముఖాలతో చెన్నైకు తిరిగి వచ్చారు. అన్నాడీఎంకే నేతల డిమాండ్‌ పట్ల బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్‌షా కూడా తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. అన్నామలైను తొలగించడం తమ ఇష్టమని, దీనిపై అన్నాడీఎంకే నేతలు మాట్లాడ్డమేంటని ఆయన రాష్ట్ర బీజేపీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

నిజంగా డిమాండే?: ఆది నుంచి బీజేపీ అధిష్ఠానం అండదండలు పొందుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వర్గం.. ఇప్పుడు కొత్తగా ‘డిమాండ్‌’ చేయడమేంటని రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి అన్నామలైపై అలకతో అన్నాడీఎంకే నేతలు ఢిల్లీకి వెళ్లలేదని, లోక్‌సభ ఎన్నికల్లో తమకు 20 స్థానాలు కావాలంటూ ఇటీవల అమిత్‌షా డిమాండ్‌ చేసిన నేపథ్యంలో.. రివర్స్‌లో ఆ పార్టీని ఇరుకున బెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అన్నామలై వంకతో అలకబూనినట్లు కనిపిస్తే తమ నుంచి స్థానాల డిమాండ్‌ తగ్గుతుందన్న ఉద్దేశంతోనే అన్నాడీఎంకే నేతలు ఇలా ముందరికాళ్లకు బంధం వేస్తున్నారే తప్ప, అంతకు మించి మరేమీ లేదని బీజేపీకి చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించడం గమనార్హం.

Updated Date - 2023-09-24T08:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising