ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: సోనియాతో కాంగ్రెస్‌ నేతల భేటీ.. లోక్‌సభ ఎన్నికలపై చర్చ

ABN, First Publish Date - 2023-10-15T07:49:00+05:30

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భేటీ అయ్యా రు. డీఎంకే మహిళా మహానాడులో పాల్గొనేందుకు

- కూటమి విజయం కోసం కృషి చేయండి

అడయార్‌(చెన్నై): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భేటీ అయ్యా రు. డీఎంకే మహిళా మహానాడులో పాల్గొనేందుకు తన కుమార్తె, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రి యాంకాతో కలిసి శుక్రవారం రాత్రి చెన్నై(Chennai)కి చేరుకున్న సోనియా శనివారం 52 మంది కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ఎనిమిదిమంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలు, ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే, రాష్ట్రంలో పార్టీ పురోగతి, పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణం, ఇండియా కూటమి బలోపేతం, కూటమి పార్టీలతో కలిసి ప్రయాణించడం తదితర అంశాలపైనా చర్చించినట్టు సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, మత విద్వేష రాజకీయాలను ప్రజలకు వివరించాలని సోనియా పేర్కొన్నారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికలకు క్షేత్రస్థాయి, బూత్‌ లెవల్‌ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఆమె స్పష్టం చేశారు. అలాగే, జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కష్టపడి పని చేసే డీసీసీ అధ్యక్షులను గుర్తించి, వారికి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా, సోనియా, ప్రియాంక రాకను పురస్కరించుకుని, వారికి స్వాగతం పలుకుతూ ఎయిర్‌పోర్టు నుంచి గిండిలోని నక్షత్ర హోటల్‌ వరకు రహదారికి ఇరువైపులా కాంగ్రెస్‌ జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంతకుముందు సోనియా, ప్రియాంకా గాంధీలకు చెన్నై ఎయిర్‌పోర్టులో సీఎం స్టాలిన్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, డీఎంకే ఎంపీలు టీఆర్‌ బాలు, కనిమొళిలు సాదర స్వాగతం పలికారు.

Updated Date - 2023-10-15T07:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising