40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: అమిత్‌షాపై సీఎం ఆగ్రహం.. మేం అడిగిందేంటి? మీరు చెప్పిందేంటి?

ABN, First Publish Date - 2023-06-13T08:24:05+05:30

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తొమ్మిదేళ్లపాలనలో రాష్ట్రానికి ప్రకటించిన పథకాల జాబితా చెప్పాలని అడిగితే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(A

Chief Minister: అమిత్‌షాపై సీఎం ఆగ్రహం.. మేం అడిగిందేంటి? మీరు చెప్పిందేంటి?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పథకాల జాబితా అడిగితే నిధుల చిట్టా విప్పుతారా?

- మేట్టూరు డ్యాం నుంచి జలాల విడుదల

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తొమ్మిదేళ్లపాలనలో రాష్ట్రానికి ప్రకటించిన పథకాల జాబితా చెప్పాలని అడిగితే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) రాష్ట్రానికి అందించిన నిధుల జాబితాను ప్రకటించి వెళ్ళిపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister) నిలదీశారు. మూడు రోజుల క్రితం సేలంలో జరిగిన డీఎంకే సభలో తాను మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన పథకాల జాబితాను వెల్లడించాలని సవాల్‌ చేశానని గుర్తు చేశారు. కేంద్రమంత్రి అమిత్‌షా ఆ సవాలును స్వీకరించి పథకాల గురించి వివరిస్తారని అనుకుంటే నిధుల వివరాలను ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం ఉదయం సేలం జిల్లా మేట్టూరు డ్యాం నుంచి కావేరి డెల్టా జిల్లాలకు సాగుజలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి.. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన పథకాల వివరాలను ప్రకటించి, ఎన్డీయే ప్రభుత్వం రాష్ర్టానికి ఇచ్చిన పథకాలేంటో చెప్పాలని తాను డిమాండ్‌ చేస్తే, ఆయన వేలూరు(Vellore) సభలో నిధుల వివరాలను ఏకరువు పెట్టి వెళ్ళిపోయారన్నారు. సేలం సభలో తాను చెప్పిన వివరాలను అమిత్‌షా చదవలేదా? లేక బీజేపీ స్థానిక నాయకులు ఆ వివరాలను ఆయనకు అనువదించి చెప్పలేదా? అని స్టాలిన్‌ ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మెట్రోరైలు పథకం, తమిళ భాషకు ప్రాచీన హోదా, ప్రాచీన తమిళ పరిశోధన కేంద్రం ఏర్పాటు, సేతు సముద్రం ప్రాజెక్టుకు శ్రీకారం, ఒరగడంలో మోటరు వాహనాల పరిశోధన కేంద్రం, తాంబరంలో జాతీయ సిద్దవైద్య పరిశోధన కేంద్రం, సేలంలో కొత్తగా రైల్వే జోన్‌ ఏర్పాటు, హార్బర్‌ - మధురవాయల్‌ వంతెనలతో కూడిన రహదారి ప్రాజెక్టు, నెమ్మెలిలో నిర్లవణీకరణ ప్లాంట్‌, హొగేకల్‌ సమగ్రనీటి సరఫరా పథకం, చెన్నై సమీపంలో మారిటైమ్‌ యూనివర్శిటీ, కరూరు, ఈరోడ్‌, సేలం నగరాలలో జౌళి పార్కుల ఏర్పాటు వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వంలా ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ప్రయోజనకరమైన పథకాలను అమలు చేసిందా అన్న ప్రశ్నకు అమిత్‌షా నుంచి సమాధానమే లేకపోయిందన్నారు. రాష్ట్రాలకు ఆదాయ వనరులను తగ్గించే విధంగా ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసి పన్నుల రూపంలో వసూలైన నిధులను రాబట్టుకుని అందులో కొంత శాతాన్ని మాత్రమే నిధుల పేరిట కేటాయిస్తోందన్న వాస్తవం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

ఎయిమ్స్‌ ఆస్పత్రి అనవసరం...

వైద్య రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందజంలో ఉన్న రాష్ట్రంలో ఎయిమ్స్‌(AIIMS) ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదన్నారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పలకు పోయి మదురైలో రూ.1200 కోట్లతో ఎయిమ్స్‌ను నిర్మిస్తామని ప్రకటించిందని తెలిపారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఆ ఆస్పత్రి ప్రాథమిక స్థాయి నిర్మాణ పనులు కూడా జరగలేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే కేంద్రమంత్రులు కొందరు అదే పనిగా ఎయిమ్స్‌ నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఈపీఎస్‌ ఆరోపణలన్నీ అవాస్తవం...

అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకాలనే డీఎంకే ప్రభుత్వం పేర్లు మార్చి తమవిగా గొప్పలు చెప్పుకుంటోందని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి గతంలో డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన మెట్రోరైలు ప్రాజెక్టు సహా పలు పథకాలను తామే అమలు చేసినట్లు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అన్నాడీఎంకే నేతలు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కోయంబేడు బస్‌స్టేషన్‌ నిర్మాణ పనులను పూర్తి చేశారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జయలలిత ఆ బస్‌స్టేషన్‌ వద్ద మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దాన్ని నిర్మించింది తామేనని ప్రకటించుకున్నారని, ఇదే విధంగా ఓమండూరు ఎస్టేట్‌ వద్ద మునుపటి డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీ భవనాలను నిర్మించి ప్రారంభిస్తే, ఆ భవన సముదాయాన్ని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి దాన్ని తామే ఏర్పాటు చేసినట్లు జయ ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టు(Metro Rail Project)ను డీఎంకే ప్రభుత్వమే రూపొందించి, జపాన్‌ నుంచి నిధులు సమీకరించి నిర్మాణ పనులు చేపట్టగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే పాలకులు ఆ ప్రాజెక్టు రూపకర్తలు తామేనంటూ చంకలు గుద్దుకున్నారని చెప్పారు. నిజం చెప్పాలంటే మెట్రో రైలు ప్రాజెక్టు కంటే మోనో రైలు ప్రాజెక్టు శ్రేయస్కరమంటూ మాజీ ముఖ్యమంత్రి జయలలిత పదే పదే ప్రకటించారని, వాస్తవాలు ఈపీఎ్‌సకు తెలియకపోవడం గర్హనీయమన్నారు. చరిత్రను రాష్ట్ర ప్రజలెవరూ మరచిపోలేదన్నారు. ఇదే రీతిలో కోట్టూరుపురంలో అన్నా శతజయంతి గ్రంథాలయం డీఎంకే ప్రభుత్వ హయాంలో ఏర్పాటైందన్న కారణంగా దాన్ని పట్టించుకోలేదన్నారు. డీఎంకే ప్రభుత్వం(DMK Govt) అధికారంలోకి వస్తే అమ్మా క్యాంటీన్లు మూతపడతాయని ఈపీఎస్‌ ఆరోపించారని, ప్రస్తుతం ఆ క్యాంటీన్లు అదే పేరుతో సమర్థవంతంగా నడుపుతున్నామని చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఈపీఎస్‌, జయ ఫొటోలతో ముద్రితమైన బ్యాగులను సైతం యధాతథంగా వినియోగించామన్నారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నదిపై మెకెదాటు వద్ద కొత్త ఆనకట్ట నిర్మించే ప్రయత్నాలను న్యాయపోరాటం జరిపి అడ్డుకుంటామని ఆయన ప్రకటించారు.

డెల్టా రైతాంగానికి రూ.75.95 కోట్లతో సాగు పథకం...

మేట్టూరు డ్యాం జలాలతో పంటలను సాగుచేయనున్న డెల్టా రైతులకుగాను రూ.75.95కోట్లతో సాగు పథకాన్ని అమలు చేస్తున్నామని స్టాలిన్‌ ప్రకటించారు. ఈ పథకం ప్రకారం ఎకరాకు 45 కిలోల యూరియా, 50 కిలోల డీఏపీ, 25 కిలోల పొటాష్‌ చొప్పున 2.5లక్షల ఎకరాలకు అవసరమైన రసాయనిక ఎరువులు పంపిణీ చేస్తామన్నారు. అదే విధంగా 1.24 లక్షల ఎకరాలకు అవసరమైన వరివిత్తనాలను 50 శాతం సబ్సిడీతో అందజేస్తామనిచెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను పంపిణీ చేయడంతోపాటు 747 పవర్‌టిల్లర్లను అందజేస్తామన్నారు. మేట్టూరు డ్యాం నుంచి విడుదలైన జలాలతో సేలం, నామక్కల్‌, ఈరోడ్‌, కరూరు, తిరుచ్చి, తంజావూరు, తిరువారూరు, అరియలూరు, పుదుకోట, మైలాడుదురై, కడలూరు, నాగపట్టినం జిల్లాల్లోని 17.37 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని, ఈ సాగు జలాలలతో డెల్టా జిల్లాల రైతులు ఖరీఫ్‌ పంటలను పండించనున్నారని ఆయన చెప్పారు.

Updated Date - 2023-06-13T08:24:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising