ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: సీఎం రెండురోజుల పర్యటన వెనుక ఉన్న మతలబు ఏమిటో..

ABN, First Publish Date - 2023-03-05T08:42:31+05:30

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆదివారం నుంచి రెండు రోజుల పాటు మదురైలో పర్యటించనున్నారు. దక్షిణాది జిల్లాల్లో చేపట్టాల్సిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అడయార్‌(చెన్నై): ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆదివారం నుంచి రెండు రోజుల పాటు మదురైలో పర్యటించనున్నారు. దక్షిణాది జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాలపై ఆయన ఆ ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ‘ముఖ్యమంత్రి క్షేత్రపరిశీలన’ కార్యక్రమాన్ని గత నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించారు. ఇందులోభాగంగా ఇప్పటికే వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై(Vellore, Ranipet, Tirupattur, Tiruvannamalai) జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఇపుడు దక్షిణాది జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. మదురై, దిండిగల్‌, శివగంగై, రామనాథపురం, తేని జిల్లాల అభివృద్ధి పనులపై ఆయన సమీక్షిస్తారు. ఈ జిల్లాల్లో చేపట్టిన, చేపట్టాల్సిన వివిధ రకాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై ఆయన ఆయా జిల్లాల ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం 9 గంటలకు విమానంలో మదురైకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు మదురై(Madurai) జిల్లా కలెక్టరేట్‌లో సౌత్‌ జోన్‌ ఐజీ, మదురై కమిషనర్‌, డీఐజీలు, ఐదు జిల్లాల ఎస్పీలతో శాంతిభద్రతలపై సమీక్షిస్తారు. సాయంత్ర 5 గంటలకు కీళడిలో నిర్మించిన పురావస్తు శాఖ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఐదు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఆయన నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన సంక్షేమ పనులపై సమీక్ష చేస్తారు. ఆ తర్వాత వ్యాపార సంఘాల నేతలు, రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు.

ఇదికూడా చదవండి: ఒకేసారి వెయ్యి ప్రైవేటు బస్సులు..! అదేగాని జరిగితే...

Updated Date - 2023-03-05T08:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising