Children's Park: 19 నుంచి చిల్డ్రన్స్ పార్కుకు రాకండి.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2023-06-14T10:49:54+05:30 IST
స్థానిక గిండిలోని చిల్డ్రన్స్ పార్కు(Children's Park) ఈ నెల 19వ తేదీ నుంచి మూతబడనుంది. రూ.20 కోట్ల తో ఆధునీకరించాలని రాష్ట్రప్రభు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక గిండిలోని చిల్డ్రన్స్ పార్కు(Children's Park) ఈ నెల 19వ తేదీ నుంచి మూతబడనుంది. రూ.20 కోట్ల తో ఆధునీకరించాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ పార్కును ఆరు నెలల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునీకరించనున్న పార్కులో అత్యాధునిక టిక్కెట్ కౌంటర్, ఫలహారశాల, పార్కింగ్ స్థలం, ఎన్‌క్లోజర్‌లు, ప్రపంచ స్థాయి థియేటర్, ఆట స్థలం తదితరాలన్నింటినీ పొందుపరచనున్నారు. రెండెకరాల్లో పార్కింగ్, ‘సౌండ్ అండ్ లైట్ షో’ వంటివి యధాతథంగా కొనసాగినా, వాటినీ ఆధునికీకరించనున్నారు. అదే విధంగా ఆధునిక ఫౌంటేన్లు, గార్డెన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికన జరుగుతాయని అధికారులు తెలిపారు. అందుకే ఆరు నెలల పాటును పార్కును వేసివేయనున్నట్లు వారు వివరించారు.