ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sengol Row: 'రాజదండం'పై కాంగ్రెస్, బీజేపీ మధ్య తాజా రగడ..

ABN, First Publish Date - 2023-05-26T16:36:27+05:30

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ ఒక్కసారిగా తెరపైకి వచ్చిన 'రాజదండం' వ్యవహారం మరోసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అధికార మార్పిడికి రాజదండం ప్రతీక అని, బ్రిటిషర్లు దేశాన్ని విడిచిపెడుతూ అధికార మార్పిడికి సంకేతంగా రాజదండం ఇచ్చివెళ్లారని బీజేపీ చెబుతుండగా, అదంతా బోగస్ అని, లిఖితపూర్వకమైన ఆధారాలేవీ కాంగ్రెస్ తాజాగా విమర్శించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ ఒక్కసారిగా తెరపైకి వచ్చిన 'రాజదండం' (Sengol) వ్యవహారం మరోసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అధికార మార్పిడికి రాజదండం ప్రతీక అని, బ్రిటిషర్లు దేశాన్ని విడిచిపెడుతూ అధికార మార్పిడికి సంకేతంగా రాజదండం ఇచ్చివెళ్లారని బీజేపీ చెబుతుండగా, అదంతా బోగస్ అని, అందుకు సంబంధించిన లిఖితపూర్వకమైన ఆధారాలేవీ కాంగ్రెస్ తాజాగా విమర్శించింది. దీనిపై బీజేపీ భగ్గుమంది.

భారతీయ సంస్కృతి, సంప్రదాయలను ఇంతగా ఎందుకు ద్వేషిస్తోందని కేంద్ర హోం మంత్రి వరుస ట్వీట్లలో ఆ పార్టీపై మండిపడ్డారు. ''భారతదేశ విముక్తికి సంకేతంగా తమిళనాడుకు చెందిన శైవమఠం స్వామీజీల నుంచి పవిత్రమైన రాజదండాన్ని పండిట్ నెహ్రూ స్వీకరించారు. కానీ దానిని ఒక వాకింగ్ స్టిక్‌లాగే మ్యూజియంలో పెట్టేశారు. ఇది మరో సిగ్గుమాలిన చర్య'' అని అమిత్‌షా విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో తిరువాడుతురై మఠం కూడా సింగోల్ ప్రాముఖ్యాన్ని వెల్లడించిందని, ఇదంతా బోగస్ అని కాంగ్రెస్ ఇప్పుడు అంటోదని అన్నారు. కాంగ్రెస్ తన ప్రవర్తన గురించి పునరాలోలించుకోవాలని అమిత్‌షా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దీనికి ముందు, కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ మాట్లాడుతూ, తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం రాజదండాన్ని మోదీ, ఆయన భజన బృందం ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. అధికార బదిలీకి రాజదండం ప్రతీక అని మౌంట్‌బాటన్, రాజాజీ, నెహ్రూ చెప్పినట్టు లిఖితపూర్వక సాక్ష్యాలు ఏవీ లేవన్నారు. ఇదంతా ఓ బోగస్ అని కొట్టివేశారు. కొత్త పార్లమెంటులోని లోక్‌సభ స్పీకర్ వేదక సమీపంలో ఈనెల రాజదండం కొలువు తీరుతోంది.

Updated Date - 2023-05-26T16:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising