ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rain Alert: వర్షాలు ముంచుకొస్తున్నాయ్.. 24 గంటలు బయటకు రావద్దు.. ప్రజలకు సీఎం కీలక సూచన

ABN, First Publish Date - 2023-07-10T12:38:59+05:30

భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకూతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తెడంతో ఇప్పటికే భారీ నష్టం వాటిల్లింది. రానున్న 24 గంటలపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకూతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తెడంతో ఇప్పటికే భారీ నష్టం వాటిల్లింది. రానున్న 24 గంటలపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. అలాగే మూడు హెల్ప్ లైన్‌ నంబర్లను కూడా ప్రకటించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 1100, 1070, 1077 నంబర్లకు ఫోన్ చేయాలాని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్, ఉనా జిల్లాలో అత్యధికంగా 17 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ముడిలో 12 సెంటీ మీటర్లు, సిమ్లాలో 9 సెంటీ మీటర్లు, ధర్మశాలలో 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


మరోవైపు భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం వణికిపోతోంది. కొండచరియలు విరిగిపడటం, వరద బీభత్సంతో భారీ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 28 మంది మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌‌లలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేశారు. 1982 తర్వాత ఢిల్లీలో జూలైలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. యమునా నది నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రతమ్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఎన్‌సిఆర్‌లలో పాఠశాలలు మూసివేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో భారీవర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వికాస్‌నగర్ సమీపంలో హిమాచల్ ప్రదేశ్ రోడ్‌వేస్ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. స్థానికుల సాయంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు వరద కాలువలో చిక్కుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-07-10T12:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising