Yogi Bulldozer : సీఎం యోగి బుల్డోజర్ ఈసారి ఎవరి ఇంటిని కూల్చిందంటే...!
ABN, First Publish Date - 2023-03-01T15:23:10+05:30
బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజు పాల్ 2005లో హత్యకు గురయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ నేత, ప్రస్తుతం జైలులో ఉన్న అతిక్ అహ్మద్
లక్నో : మాఫియాను మట్టి కరిపిస్తానని ఉత్తర ప్రదేశ్ శాసన సభలో గర్జించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అందుకు తగినట్లుగానే చర్యలు చేపడుతున్నారు. ఉమేశ్ పాల్ (Umesh Pal) హత్య కేసులో నిందితుడు, గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అనుచరుడు ఖలీద్ జాఫర్ ఇంటిపైకి బుల్డోజర్‌ను పంపించారు. ప్రయాగ్‌రాజ్‌లోని కరేలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చకియాలో ఈ ఇల్లు ఉంది.
బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజు పాల్ 2005లో హత్యకు గురయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ నేత, ప్రస్తుతం జైలులో ఉన్న అతిక్ అహ్మద్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసులో కీలక సాక్షి ఉమేశ్ పాల్‌ను ఆయన నివాసం బయట ఫిబ్రవరి 24న కాల్పులు జరిపి, హత్య చేశారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ సందీప్ నిషాద్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో కానిస్టేబుల్ రాఘవేంద్ర సింగ్ పరిస్థితి విషమంగా ఉంది. ఉమేశ్ హత్య కేసులో కూడా అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉంటూనే ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపించారు.
ఉమేశ్ పాల్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బాజ్ సోమవారం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మరో నిందితుడు సదాకత్ ఖాన్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది.
ఈ నేపథ్యంలో ఖలీద్ జాఫర్ ఇంటిని కూల్చేందుకు బుల్డోజర్ వెళ్లింది. ఇదిలావుండగా, ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇంటిని చట్టవిరుద్ధంగా నిర్మించినట్లు తెలుస్తోంది. దీని కూల్చివేతకు గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పీడీఏ వైస్ చైర్మన్ అరవింద్ కుమార్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తెలిపారు. అందుకే దీనిని కూల్చేస్తున్నామన్నారు. చట్ట ప్రకారం అవసరమైన అన్ని పద్ధతులను పాటించినట్లు తెలిపారు. ఈ ఇంటి యజమానికి ముందుగానే నోటీసు ఇచ్చామని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Supreme Court : అంబానీ కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత... ఖర్చుల భారం ఎవరు మోయాలంటే...
Bomb Threat : అమితాబ్, ధర్మేంద్రలకు బాంబు బెదిరింపులు
Updated Date - 2023-03-01T15:23:36+05:30 IST