ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: పొత్తు లేకున్నా మద్దతిస్తాం.. ఎందుకంటే?

ABN, First Publish Date - 2023-04-23T15:44:08+05:30

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఊహించని పరిణామం జరిగింది.

Karnataka Assembly Elections
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఊహించని పరిణామం జరిగింది. ఎలాంటి పొత్తులు కుదుర్చుకోకున్నా కాంగ్రెస్ పార్టీకి (Congress) మద్దతిస్తామంటూ సీపీఐ (Communist Party of India) ముందుకొచ్చింది. అదే సమయంలో ఏడు చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం 224 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాము పోటీ చేసే ఏడు చోట్ల తప్ప మిగతా 215 నియోజకవర్గాల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని సీపీఐ(CPI) ప్రకటించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. మరోసారి బీజేపీ(BJP) అధికారంలోకి రాకుండా చేయాలంటే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించామంది.

సీపీఐ ఇప్పటికే ముడిగెరె, అల్వాండ్, జెవార్గీ, కుడ్లగీ, కేజీఎఫ్, సిమ్, మడికేరీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బాగేపల్లిలో సీపీఎం అభ్యర్థికి, మేల్కొటేలో సర్వోదయ కర్ణాటక పార్టీ అభ్యర్థికి కూడా మద్దతిస్తామని, మిగతా 215 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు మద్దతిస్తామని సీపీఐ స్పష్టం చేసింది.

సీపీఐ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సీపీఐ ఎలాంటి షరతుల్లేకుండా తమకు తాముగా మద్దతిస్తామని ముందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా తెలిపారు. సీపీఐ పోటీ చేస్తున్న ఏడు నియోజకవర్గాల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ ఉంటుందన్నారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించి అభ్యర్ధులను ప్రకటించింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉధృతంగా ప్రచారం చేస్తోంది.

సీపీఐ ఇటీవలే జాతీయ హోదా కోల్పోయింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ సీపీఐకి చెప్పుకోదగ్గ ఓట్‌షేర్ లేదు.

కర్ణాటకలో మే పదిన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-04-23T15:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising