ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Parliament Inauguration row: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కేజ్రీవాల్, ఖర్గేపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-05-27T15:52:24+05:30

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ వివాదంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలపై ఫిర్యాదు నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కులాన్ని ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వీరిపై ఈ ఫిర్యాదు నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవన (New Parliament building) ప్రారంభోత్సవ వివాదంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), ఇతర నేతలపై ఫిర్యాదు నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కులాన్ని ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వీరిపై ఈ ఫిర్యాదు (Complaint) నమోదైంది. వీరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ కమ్యూనిటీల మధ్య శత్రుత్వాన్ని పెంపెందించేందుకు, భారత ప్రభుత్వంపై అపనమ్మకాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో ఐపీసీ సెక్షన్ 121,153A,505,34 కింద వీరిపై ఫిర్యాదు నమోదైంది.

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర విపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆప్, తృణమూల్ సహా 20కి పైగా పార్టీలు తాము కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో పాల్గొనడం లేదని ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశాయి. ఈనెల 28వ తేదీన కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-05-27T15:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising