ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi : రాహుల్ గాంధీకి జర్మనీ మద్దతు... ధన్యవాదాలు చెప్పిన దిగ్విజయ సింగ్...

ABN, First Publish Date - 2023-03-30T14:10:25+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడాన్ని గుర్తించినట్లు చెప్పిన

Rahul Gandhi , Digvijaya Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడాన్ని గుర్తించినట్లు చెప్పిన జర్మనీకి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) గురువారం ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల అమెరికా కూడా రాహుల్ గాంధీపై అనర్హత వేటును పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మోదీ ఇంటిపేరును అవమానించారనే ఆరోపణలపై ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంతో, లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.

జర్మనీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భారత దేశంలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన తొలి తీర్పును జర్మనీ గుర్తించిందని చెప్పారు. ఆయన పార్లమెంటరీ మేండేట్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా జర్మనీ గమనించిందన్నారు. ఈ తీర్పుపై అపీలు చేసే పరిస్థితిలో గాంధీ ఉన్నారని తమకు తెలిసిందన్నారు. ఈ తీర్పు నిలబడుతుందో, లేదో , అపీలుపై విచారణ ద్వారా తెలుస్తుందన్నారు. అదేవిధంగా ఆయనను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడానికి తగిన ప్రాతిపదిక ఉందో, లేదో కూడా స్పష్టమవుతుందన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, ప్రాథమిక ప్రజాస్వామిక సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసుకు వర్తిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

దీనిపై స్పందిస్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Union Law Minister Kiren Rijiju) ఇచ్చిన ట్వీట్‌లో, విదేశీ జోక్యం ద్వారా భారత దేశ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలన్నారు. భారత దేశం విదేశీ పలుకుబడిని ఎంత మాత్రం సహించదని, ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోదీ గారు ప్రధాన మంత్రి అని తెలిపారు.

దిగ్విజయ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, రాహుల్ గాంధీని పీడించడం ద్వారా భారత దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా దెబ్బతింటోందో గుర్తించినందుకు జర్మన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, రిచర్డ్ వాకర్‌కు ధన్యవాదాలు చెప్పారు.

దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని కర్ణాటకలో 2019లో ప్రశ్నించిన రాహుల్ గాంధీ ఇటీవల గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పుతో తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Modi Vs Mamata : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన దీదీ.. వీడియో వైరల్

Lalit Modi Vs Rahul Gandhi : రాహుల్ గాంధీకి లలిత్ మోదీ హెచ్చరిక

Updated Date - 2023-03-30T14:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising