ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress leadership: లుకలుకలపై అధిష్టానం ఆగ్రహం.. మీరంతా ఢిల్లీకి రండి

ABN, First Publish Date - 2023-07-29T13:15:38+05:30

రెండు నెలల కిందట అనూహ్యమైన మెజారిటీతో ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మంత్రులు తమ

- 2న రావాలని సీఎం సహా మంత్రులకు పిలుపు

- బీకే హరిప్రసాద్‌కూ ఆహ్వానం

- విభేదాల కట్టడికి కాంగ్రెస్‌ కసరత్తు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రెండు నెలల కిందట అనూహ్యమైన మెజారిటీతో ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మంత్రులు తమను నిర్లక్ష్యం చేశారంటూ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌(MLA BR Patil) లెటర్‌హెడ్‌లో ఏకంగా 30 మంది నేరుగా సీఎంకు లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాలను కుదుపేసింది. ఇందు కోసమే గురువారం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభ్యుల సమావేశం కూడా వాడివేడిగానే సాగినట్లు తెలుస్తోంది. ఆరంభంలోనే పరిస్థితి అదుపు చేయకుంటే పెను ముప్పు తప్పదని అధిష్టానం భావించింది. ఈ మేరకు సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌(CM Siddaramaiah and DCM DK Shivakumar)తో పాటు మంత్రులందరూ ఆగస్టు 2న ఢిల్లీ రావాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఆదేశించారు. బీజేపీ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ కు ప్రజలు పట్టంగడితే అంతలోనే సొంత పార్టీలోనే తలెత్తున్న విభేదాలను నియంత్రంచాల్సిందేనని సీఎం సిద్దరామయ్యకు అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. అందుకోసమే ఏర్పడిన శాసనసభ్యుల సమావేశంలో మంత్రులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దారితప్పించే ప్రక్రియ సాగుతోందని మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.

ప్రధానంగా ఇద్దరు మంత్రుల తీరుపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వారికి కొంత సమయాన్ని కేటాయించాలని సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితి మరింత చేయిదాటక ముందే ఢిల్లీలో మంత్రులకు తగిన హితబోధ చేయాలని అధిష్టానం నిర్ణయించింది. బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా పాల్గొంటారు. కేబినెట్‌లో చోటు లభించక అసంతృప్తితో ఉన్న బీకే హరిప్రసాద్‌కు ఢిల్లీ సమావేశానికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. బీకే హరిప్రసాద్‌(BK Hariprasad) ఇటీవల ముఖ్యమంత్రిని చేయడం తెలుసు అంతకంటే దించడం కూడా వచ్చుననే వ్యాఖ్యలపైనా చర్చ జరిపే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు వ్యవహరించాల్సిన వ్యూహాలపై సలహాలు ఇస్తూనే మంత్రుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోదలచినట్లు తెలుస్తోంది. ఢిల్లీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది.

Updated Date - 2023-07-29T13:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising