ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi Vs Congress : మోదీ ప్రభంజనంపై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-12T14:43:37+05:30

మోదీ గడచిన తొమ్మిదేళ్ళ నుంచి దేశాన్ని నడుపుతున్న తీరుకు భిన్నంగా ఏ విధంగా నడుపుతారో వివరించి చెప్పగలిగే పోటీదారులు

Manish Tewari, Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఎదుర్కొనాలంటే స్పష్టమైన, బలమైన ప్రత్యర్ధి తప్పనిసరి అని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ (Manish Tewari) అన్నారు. ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన ‘థింక్ఎడ్యు’ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా లేదన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఒకదానితో మరొకటి పోరాడుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే, ప్రత్యామ్నాయ దార్శనికత (Vision)ను వివరించి, చెప్పగలిగే, ప్రత్యేకతగల పోటీదారు, లేదా, పోటీదారులు ఉండాలన్నారు.

మోదీ గడచిన తొమ్మిదేళ్ళ నుంచి దేశాన్ని నడుపుతున్న తీరుకు భిన్నంగా ఏ విధంగా నడుపుతారో వివరించి చెప్పగలిగే పోటీదారులు అవసరమని చెప్పారు. దేశంలో మార్పు తేగలిగేది ప్రతిపక్ష పార్టీల కన్నా ప్రజలేనని చెప్పారు. ప్రజలే మార్పు తేగలరని తెలిపారు. చెల్లాచెదురుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడితే, పెద్దన్న పాత్ర పోషించి, క్షేత్ర స్థాయి వాస్తవాలను అంగీకరించేందుకు కాంగ్రెస్ సిద్ధమేనని తెలిపారు. వ్యాకులతకు ఓ రూపం ఇచ్చి, స్పష్టపరచడానికి ఓ దివిటీ అవసరమని తెలిపారు.

ఇదిలావుండగా, ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను 2022 సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 30న కశ్మీరులో ముగిసింది. ఆయన దాదాపు 4,080 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాలో ఈ యాత్ర సాగింది. మార్గమధ్యంలో అనేక చోట్ల సామాన్య ప్రజలతో ఆయన సంభాషించారు.

అదానీ గ్రూప్‌పై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత లేదా న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పార్లమెంటులో పెద్ద ఎత్తున గళమెత్తుతోంది.

Updated Date - 2023-02-12T14:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising